Bigg Boss Shivaji Web Series: చాలా ఏళ్ల తర్వాత బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు హీరో శివాజీ. బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ల‌లో శివాజీ కూడా ఒకరు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచే తన ప్రణాళికలు, మాటతీరుతో అందరి మనసులు గెలుచుకుంటున్నాడు శివాజీ. నటుడిగా మరోసారి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు శివాజీ. ఏడేళ్ల త‌ర్వాత నైంటీస్(90's Web Series) అనే వెబ్‌సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఏ మిడిల్ క్లాస్ బ‌యోపిక్ అనేది దీని క్యాప్షన్. ఈ సిరీస్‌లో చంద్ర‌శేఖ‌ర్ అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. తాజాగా అతడి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ను బట్టి చూస్తే.. శివాజీ మ్యాథ్స్ టీచ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. వ‌న‌ప‌ర్తి అనే ఊరి బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్ సిరీస్‌ తెరకెక్కుతున్నట్లు పోస్టర్ ను చూస్తే అర్థమవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వెబ్ సిరీస్‌కు ఆదిత్య హ‌స‌న్ దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఈ సిరీస్‌కు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలో ఈటీవీ విన్ ఓటీటీలో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ల్యాంగ్ గ్యాప్ తర్వాత శివాజీ మళ్లీ నటుడిగా రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ వెబ్ సిరీస్‌పై అందరికీ ఆసక్తి పెరిగింది. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. ఆ తర్వాత హీరోగా మారాడు శివాజీ(Hero Shivaji). మిస్స‌మ్మ‌, మంత్ర‌, అమ్మాయి బాగుంది, శ్రీరామచంద్రులు, టాటా బిర్లా మధ్యలో లైలా వంటి సినిమాలు ఆయనకు కమర్షియల్ సక్సెస్ ను ఇచ్చాయి. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. 2016లో రిలీజైన సీసా త‌ర్వాత ఆయన సినిమాలకు దూరమయ్యాడు. మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇనింగ్స్ ప్రారంభిస్తున్నాడు. 



Also Read: Miss Shetty Mr Polishetty: ఓటీటీలోకి వచ్చేసిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook