Takkar OTT Streaming date: తమిళంతో పాటు తెలుగులోనూ సేమ్ క్రేజ్ ఉన్న నటుడు సిద్ధార్థ్. రీసెంట్ గా టక్కర్ అనే మూవీ  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తిక్‌ జి.క్రిష్‌ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందా అని ఓటీటీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా దీని స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. ఈ సినిమా జూలై 07 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. పేదవాడిగా పుట్టిన ఓ కుర్రాడు కోటీశ్వరుడు అవ్వాలనే క్రమంలో అతడి ఎదుర్కోన్న సంఘటనలను ఈ చిత్రంలో చూపించారు. సిద్ధార్థ్ సరసన దివ్యాన్ష కౌశిక్‌ హీరోయిన్ గా నటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వచ్చినప్పటి నుంచి ఎక్కువ మంది సినిమాలు ఓటీటీలో చూడటానికే ఇష్టపడుతున్నారు. థియేటర్లలో రిలీజ్ అయి హిట్ అయినా సినిమాలైతే ఏడు, ఎనిమిది వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలైతే నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని చిత్రాలైతే థియేటర్లోకి వచ్చిన వారం రోజులకే ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా  వచ్చిన సిద్ధార్ధ టక్కర్ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది నెట్‌ఫ్లిక్స్‌ లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు సిద్ధార్ధ్.


Also Read: Rana Daggubati-Teja Movie: రెండు పార్టులుగా రానా-తేజ మూవీ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook