సినిమా టైటిల్:    దృశ్యం 2
నటీనటులు:         వెంకటేష్, మీనా, కృతికా, పూర్ణ, వినయ్ వర్మ, సంపత్ రాజ్, ఈస్టర్ అనిల్, నదియా, నరేష్ తదితరులు
కథ, దర్శకత్వం:  జీతు జోసెఫ్ 
నిర్మాణ సంస్థ:      సురేష్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్
సంగీతం:              అనూప్ రూబెన్స్
విడుదల తేది:      నవంబర్‌ 25, 2021


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Drushyam 2 Movie Review and Rating: టాలీవుడ్ (Tollywood)సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'దృశ్యం 2' (Drushyam 2). మీనా (Meena), కృతిక, ఈస్తర్ అనిల్, నరేష్, నదియా, సంపత్ రాజ్, పూర్ణ,  వినయ్ వర్మ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా.. థియేటర్లో కాకుండా ఓటీటీలో (OTT) విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో గత అర్థరాత్రి నుంచి దృశ్యం 2 సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. దృశ్యం 2 కోసం వేయి కళ్లతో వేచిచూసిన అభిమానులు అర్థరాత్రే సినిమాను తిలకించారు. అయితే ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. మొదటి భాగంలానే ప్రేక్షకులను మెప్పించిందో లేదో రివ్యూలో (Drushyam 2 Review) చూద్దాం.


కథ...
దృశ్యం మొదటి భాగం (Drushyam First Part) ముగిసిన చోటు నుంచే సీక్వెల్‌ కథ మొదలవుతుంది. పోలీస్ ఆఫీసర్ (నదియా) కుమారుడు వరుణ్‌ మర్డర్ కేసు నుంచి బయటపడిన రాంబాబు (వెంకటేశ్‌) కుటుంబం.. బాగా స్థిరపడుతోంది. కేబుల్‌ టీవీ ఆపరేటర్‌ స్థాయి నుంచి రాంబాబు థియేటర్‌ ఓనర్‌గా ఎదుగుతాడు. అక్కడితో ఆగకుండా అతడికి ఉన్న సినిమా పిచ్చితో ఏకంగా ఓ సినిమాను నిర్మించే ప్రయత్నాల్లో ఉంటాడు. అయితే వరుణ్‌ కేసు తాలూకు భయాలు మాత్రం రాంబాబు కుటుంబ సభ్యుల మెదుడులో అలానే ఉండిపోతాయి. మరోవైపు వరుణ్‌ మర్డర్ కేసు నుంచి బయటపడి ఆరేళ్లు దాటినా.. పోలీసులు మాత్రం రాంబాబు కుటుంబంను అనుమానిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే  రాంబాబు భార్య జ్యోతి (మీనా).. పిల్లలు అంజు (కృతిక), అను (ఏస్తర్‌)లను నీడలా వెంటాడుతుంటారు. సరైన ఆధారాల కోసం పోలీసులు గాలిస్తుంటారు. ఈ కేసును ఎంతో చాలెంజ్‌గా తీసుకున్న పోలీస్‌ ఆఫీసర్‌ గౌతమ్‌ సాహు (సంపత్‌రాజ్‌) రాంబాబుకు వ్యతిరేకంగా కీలకమైన ఆధారాన్ని సంపాదిస్తాడు. మరి వరుణ్ కేసు విషయంలో సాహుకు దొరికిన ఆధారాలేంటి? రాంబాబు తన కుటుంబంను కాపాడుకున్నాడా? లేదా? అన్నదే మిగతా కథ. 


ఎవరెలా చేశారంటే...
ఎప్పటిలానే వెంకటేశ్‌ తన అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం వెంకీ పడే తపన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దృశ్యంలో కంటే సీక్వెల్‌లో మరింతగా ఆకట్టుకున్నాడు. రెండో భాగంలో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ని వెంకటేశ్‌ అద్బుతంగా పండించాడు. మొత్తానికి ఒక్కో సన్నివేశంలో వెంకిమామ జీవించేశాడు అని చెప్పొచ్చు. రాంబాబు భార్య జ్యోతి పాత్రకు మీనా న్యాయం చేసింది. కృతిక, ఎస్తర్‌ అద్భుతంగా నటించారు. కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులుగా నదియా, నరేశ్‌ ఆకట్టుకున్నారు.  సంపత్‌ రాజ్‌, సత్యం రాజేశ్‌, పూర్ణ, తనికెళ్ల భరణి, వినయ్ వర్మ తమ పాత్రల పరిధిమేర నటించారు.


సినిమా ఎలా ఉందంటే...
దృశ్యం లానే దృశ్యం 2 సినిమా కొనసాగింది. ఫ్యామిలీ ఎపిసోడ్స్‌ కొన్ని రిపీట్‌ అవుతూనే ఉంటాయి. అయితే మొదట కొంత భాగం బోర్ కొట్టించినా.. సెకండాఫ్‌లో కథ స్పీడ్‌గా వెళ్తుంది. రెండో భాగంలో ఎవరూ ఊహించని ట్విస్టులు కొన్ని ఉంటాయి. అవి ప్రేక్షకులలలో ఆసక్తిని పెంచుతాయి. కేసు నుంచి తన కుటుంబంను కాపాడుకునేందుకు వెంకటేష్ వేసే ఎత్తులు చాలా ఉత్కంఠభరితంగా సాగుతాయి. ముఖ్యంగా చివరిలో వెంకీ ఇచ్చే ట్విస్ట్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతారు. ఇక కోర్టు సన్నివేశాలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తాయి. అయితే సినిమాలో మలయాళ ఛాయలే ఎక్కువగా కనిపించాయి. ఏదేమైనా కుటుంబమంతా కలిసి సరదాగా చూసే సినిమా ఇది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook