Vijay Deverakonda Next Movie: టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమాతో బిజీగా ఉన్న ఈ రౌడీ హీరో.. తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నాడనే దానిపై సస్పెన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సస్పెన్స్‌కు తెరదించుతూ దర్శకుడు శివ నిర్వాణతో ప్రాజెక్టుకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి గతేడాదే విజయ్, శివ నిర్వాణ కాంబినేషన్‌‌లో సినిమా లాంచ్ కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత శివ నిర్వాణ 'టక్ జగదీష్' ఫ్లాప్ కావడంతో ఇక ఈ కాంబినేషన్ అటకెక్కినట్లేననే ప్రచారం జరిగింది. బాక్సాఫీస్ వద్ద 'టక్ జగదీష్' ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోవడంతో శివ నిర్వాణతో సినిమాను విజయ్ పక్కన పెట్టేసినట్లు రూమర్స్ వచ్చాయి. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం శివతో సినిమాకు విజయ్ రెడీ అయినట్లు సమాచారం.


విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కే మూవీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. లైగర్ షూట్ పూర్తయిన వెంటనే విజయ్ (Vijay Deverakonda) శివ నిర్వాణ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ 'లైగర్' షూట్‌లో బిజీగా ఉన్నాడు. విజయ్, అనన్య పాండే హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న లైగర్ సినిమాను పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA)' బ్యాక్ డ్రాప్‌లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన లైగర్ గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 


Also Read: Aishwarya Dhanush Covid 19: కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఐశ్వర్య ధనుష్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook