Comments on Samantha: సమంతకు అట్రాక్ట్ అయిన యంగ్ హీరో.. భార్య మాస్ వార్నింగ్ దెబ్బకు సైలెంట్!
Hero Wife Sensational Comments on Samantha: సమంతతో జాగ్రత్తగా ఉండాలంటూ ఒక టాలీవుడ్ యంగ్ హీరోను ఆయన భార్య హెచ్చరించినట్టు ఒక వార్త వైరల్ అవుతోంది, దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే
Young Hero Wife Sensational Comments on Samantha: సమంత తన భర్త నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్న సంగతి తెలిసిందే =, అయినా సరే సినిమాల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఆమె వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. ఇటీవల యశోద అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. నిజానికి ఆ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ మీద ప్రభావం పడుతుందని అనుకున్నారు కానీ మొదటి వారం గట్టిగానే సినిమా కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత కాలంలో కలెక్షన్స్ కాస్త తగ్గినా సరే చివరికి ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించి సమంత సినిమా హిట్ కొట్టింది .
అయితే ఈ సినిమాలో ఆమె నటన అత్యద్భుతంగా ఉందని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. యశోద అనే నిస్సహాయురాలి పాత్రలో ఆమె అద్భుతమైన నటన కనబరిచిందని వారంతా కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సమంత గురించి ఒక యంగ్ హీరో భార్య చేసిన కామెంట్లు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో సమంత అనారోగ్యంతో బాధపడుతూ ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పేర్కొన్న వెంటనే ఆమెకు పెద్ద ఎత్తున హీరోల నుంచి అభిమానుల నుంచి త్వరగా కోలుకోవాలని మెసేజ్ లు వచ్చాయి.
అలాగే సదరు యంగ్ హీరో కూడా సమంత త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకున్నాడట. విడాకులు తీసుకున్నప్పటి నుంచి సమంతకు దగ్గరవుతున్న టాలీవుడ్ యంగ్ హీరో ఆమెకు సంబంధించిన అన్ని విషయాలలోనూ కలగజేసుకుని సమంత పేరు జపిస్తున్నాడని టాక్. ఆయన సమంతకు సపోర్టుగా మాట్లాడుతుండడంతో ఈమధ్యనే పెళ్లి చేసుకున్న ఆయన భార్య మాత్రం సమంతకు దూరంగా ఉండమని అతనికి వార్నింగ్ ఇచ్చిందట.
సదరు భార్య-సమంత మధ్య ఏమీ జరగలేదు, అసలు పరిచయమే లేదు కానీ స్ట్రిక్ట్ కండిషన్స్ తో సమంతకు దూరంగా ఉండమని తన భర్తకు వార్నింగ్ ఇచ్చిందట. ఆమె మగవారి విషయంలో కాస్త వింతగా ప్రవర్తిస్తుంది కాబట్టి మీరు ఆమెకు దూరంగా ఉండండి లేకపోతే మీ జీవితం కూడా ఇబ్బంది పాలవుతుంది అంటూ సదరు యంగ్ హీరోని ఆయన భార్య హెచ్చరించినట్లుగా మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది.
ఎందుకంటే సమంతకు ఏ యంగ్ హీరో కూడా నేరుగా సపోర్ట్ చేయడం లేదు. అయితే ఒకవేళ నిజంగానే సమంతను సపోర్ట్ చేసినా అందులో తప్పేముంది? మరీ ముఖ్యంగా మగాళ్ళ విషయంలో సమంత ధోరణి కరెక్ట్ కాదని, మీరు దూరంగా ఉండాలంటూ ఆ హీరో భార్య వార్నింగ్ ఇచ్చేంత విషయం అయితే ఇందులో లేదు కావాలనే ఏమి ఊసుపోక వార్తలు రాసే వారు సృష్టించిన వార్త అయి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Prasanna Kumar: మేమలా అనలేదు, వారసుడు వివాదంపై పెదవి విప్పిన ప్రసన్న కుమార్
Also Read: Surgery forr Abbas: అబ్బాస్ కాలికి గాయం.. సర్జరీ చేసిన వైద్యులు.. ఏమైందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook