Prabhas Upcoming Movie: ప్రభాస్-మారుతి సినిమా నుంచి హీరోయిన్ ఫైట్ సీన్ లీక్, వీడియో వైరల్
Prabhas-Maruthi Movie: ప్రభాస్ ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే సలార్ షూటింగ్ ను పూర్తి చేయగా.. ఇప్పుడు మారుతీ సినిమాను కంప్లీట్ చేసేందుకు సిద్దమయ్యాడు. తాజాగా ప్రభాస్-మారుతీ సినిమా నుంచి ఓ ఫైట్ సీన్ లీకైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Prabhas-Maruthi Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-మారుతీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరో వైపు మారుతీతో ఓ చిన్న సినిమాకు కమిట్ అయ్యాడు ప్రభాస్. ప్రస్తుతం సలార్, కల్కి వంటి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్న డార్లింగ్.. వీలుచిక్కినప్పుడల్లా మారుతి మూవీ షూటింగ్ లో పాల్గొంటూ సినిమాను కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడట. ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ చిత్రానికి రాజా డీలక్స్ అనే పేరు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సంజయ్ దత్ ఓ కీలకపాత్రలో నటించనున్నాడట.
అయితే ప్రభాస్ సినిమా షూటింగ్ లకు సంబంధించి తరచూ ఫోటోలు, వీడియోలు లీకవుతున్నాయి. ఈ మధ్యనే ఈ సినిమా సెట్స్ నుంచి లీకైన ప్రభాస్ స్టిల్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. తాజాగా మరోసారి ఈ మూవీ సెట్స్ నుంచి హీరోయిన్ ఫైట్ సీన్ లీకైంది. కూరగాయల మార్కెట్‌లో మాళవిక మోహనన్ గాల్లో ఎగిరి విలన్స్ ను తంతున్న వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతోంది. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా మాళవికా మోహనన్‌తో పాటు మరో ఇద్దరు కథానాయికలు నటించనున్నారుట. ఈ చిత్రాన్ని పీపులు మీడియా సంస్థ నిర్మిస్తుంది.
మరోవైపు వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీని పూర్తి చేయగా.. ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఇంకోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా చేస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె వంటి స్టార్స్ ఈ సినిమాలో చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ కానుంది. ప్రభాస్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో స్పిరిట్ అనే మూవీని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మెుదలుకానుంది.
Also Read: Varun-Lavanya wedding: పెళ్లి షాపింగ్‌లో బిజీ బిజీగా వరుణ్-లావణ్య, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook