ఈ ఆరుగురు హీరోయిన్స్‌కి తీవ్ర అనారోగ్య సమస్యలు.. నొప్పిని పంటి బిగువున భరిస్తూనే నటిస్తున్నారు!
Indian Heroines Health Problems. దీపికా పదుకొనే తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు ధైర్యంగా అందరితో పంచుకుంది. కెమెరా ముందు ఏడ్చి అందరినీ కదిలించిన కొద్దిమంది తారల్లో ఆమె కూడా ఒకరు.
Samantha, Ileana and Nayanthara suffered severe health issues: సినిమా హీరోయిన్స్‌ది విలాసవంత జీవితం. పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు, చుట్టూ పనివాళ్లు ఉన్నారు. అనుకున్నది చిటికలో వాళ్ల ముందుంటుంది. ఏ చిన్న సమస్య కూడా వారికి ఉండదు. ఇక అనారోగ్య సమస్యలు ఉండవు. ఒకవేళ ఉన్నా.. టాప్ డాక్టర్ల వద్దకు వెళ్లి క్యూర్ అవుతారు.. ఇలా ఎన్నో మనం అనుకుంటాం. కానీ వాళ్లూ మనలాంటి సాధారణ మనుషులే. వాళ్లకూ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అయినా కూడా ప్రేక్షకులను అలరించేందుకు తమ బాధను పంటి బిగువున భరిస్తూనే నటిస్తారు. ఇలాంటి హీరోయిన్స్ భారత దేశంలో చాలా మందే ఉన్నారు. ఓసారి ఆ జాబితా చూద్దాం.
దీపికా పదుకొనే:
దీపికా పదుకొనే తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు ధైర్యంగా అందరితో పంచుకుంది. కెమెరా ముందు ఏడ్చి అందరినీ కదిలించిన కొద్దిమంది తారల్లో ఆమె కూడా ఒకరు. ఆరేడేళ్ల కిందట ప్రేమ వైఫల్యాలు, పని ఒత్తిడితో తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యారు. దాని నుంచి బయటపడటానికి కౌన్సెలింగ్ తీసుకున్నారు. దీపికా తన సమస్యను పంచుకోవడమే కాకూండా తనలా బాధపడుతున్న ఇతరులకు సహాయం చేయడానికి 'లైవ్ లవ్ లాఫ్' అనే సంస్థను కూడా ప్రారంభించారు.
భాగ్యశ్రీ:
'లౌట్ ఆవో త్రిష' అనే టెలివిజన్ షో షూటింగ్ సమయంలో తన కుడి చేయి కదపలేకపోయాయని, దాని నుంచి కోలుకోవడానికి ఏడాది పట్టిందని బాలీవుడ్ నటి భాగ్యశ్రీ వెల్లడించారు. భాగ్యశ్రీ కండరాల సమస్యతో బాధపడ్డారు. డాక్టర్లు శస్త్రచికిత్సను సూచించినా.. ఆమె స్వయంగా వ్యాయామం చేసి దాన్నుంచి బయటపడ్డారు. ఇప్పటికీ భాగ్యశ్రీ ఇంట్లోనే యోగా, జిమ్ చేస్తారు.
సమంత రూత్ ప్రభు:
2012లో పాలిమార్ఫస్ లైట్ ఎరప్షన్‌తో బాధపడ్డారు. ఇది చర్మ వ్యాధి. కొంచెం ఎండ వేడి తగలగానే చర్మంపై దురద మొదలవుతుంది. మంట పుడుతుంది. పది నిమిషాలకు మించి ఎండలో ఉండలేరు. దాదాపు రెండేళ్లపాటు దీంతో సతమతమైంది సామ్.. ఇప్పుడు కాస్త ఉపశమనం పొందారు.
ఇలియానా :
బాడీ డిస్మోర్ఫిక్ డిజార్డర్ మరియు డిప్రెషన్‌తో బాధపడ్డారు ఇలియానా. నేనేం అందంగా లేను, నాలో చాలా లోపాలున్నాయి అనుకుంటూ తనలో తనే కొన్నేళ్లపాటు బాధను అనుభవించారు ఇల్లీ బేబీ. కుటుంబం, స్నేహితుల అండతో ఆ సమస్య నుంచి బయటపడ్డారు. సుమారు మూడు సంవత్సరాల క్రితం ఈ సమస్యను ఎదుర్కొన్నారు.
స్నేహ ఉల్లాల్:
మనల్ని రోగాల బారి నుంచి కాపాడాల్సిన రక్షణ వ్యవస్థే (ఆటో ఇమ్యూన్ డిజార్డర్).. స్నేహా ఉల్లాల్ పాలిట శత్రువులా మారింది. స్నేహా రక్తానికి సంబంధించిన వ్యాధితో బాధపడ్డారు. కెరీర్ ఊపందుకుంటున్న దశలో ఈ జబ్బుతో బాధించారు. దీర్ఘకాలిక చికిత్స తీసుకోవడంతో ఆమె కొన్నాళ్ల పాటు నటనకే దూరం కావాల్సి వచ్చింది.
నయనతార:
నయనతార చర్మంకు సంబందించిన వ్యాధి (మిస్టరీ స్కిన్ డిజార్డర్)తో సతమతమయ్యారు. మేకప్ వేసుకుంటే నొప్పి తట్టుకోలేక షూటింగ్ సైతం రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అరుదైన చర్మ సమస్యగా తేలింది. ముఖ్యంగా మాంసాహారం తిన్నప్పుడు ఈ సమస్య తీవ్రంగా ఉండేదట. మందులతో పాటు ఏడాదిన్నరపాటు కేరళ ఆయుర్వేద మందులు వాడిన తర్వాత ఆమె కోలుకున్నారు.
Also Read: Boiled Lemon Water: ఉడకబెట్టిన నిమ్మ నీరు తాగితే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు
Also Read: Nivetha Pethuraj Pics: మినీ డ్రెస్సులో బెడ్‌పై పడుకుని.. నివేత పేతురాజ్ అందాల ప్రదర్శన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook