Aadikeshava: ఆదికేశవ నుంచి ‘`హే బుజ్జి బంగారం’` సాంగ్ వచ్చేసింది.. డ్యాన్స్ తో ఇరగదీసిన వైష్ణవ్, శ్రీలీల..
Aadikeshava Movie: వైష్ణవ్ తేజ్ -శ్రీలీల కాంబోలో వస్తున్న మూవీ ఆదికేశవ. తాజాగా ఈ మూవీ నుంచి ఓ బ్యూటిపుల్ మెలోడి సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Aadikeshava Songs: మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నయా మూవీ ఆదికేశవ (Aadikeshava). శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ సెన్షేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్ మెంట్స్ (Sithara Entertainments)-ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లుపై నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బీస్ట్ ఫేం అపర్ణా దాస్ మరో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి.
తాజాగా 'హే బుజ్జి బంగారం' అనే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూర్చగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ సాంగ్ ను అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల అలపించారు. ఈ సాంగ్ ను యూరప్ లోని అందమైన లోకేషన్స్ లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో వైష్ణవ్ తేజ్, శ్రీలీల డాన్స్ తో అదరగొట్టారు. శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ అందించారు.
తొలి చిత్రం ఉప్పెనతో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత ఈ మెగా హీరో చేసిన కొండపొలం, అంగరంగ వైభవంగా డిజాస్టర్ గా నిలిచాయి. ఈ హీరోకు ఆర్జెంట్ గా ఓ హిట్ కావాలి. దీంతో ఎంతో కసిగా ఈ మూవీని చేస్తున్నాడు. మరి ఈ సినిమాతోనైనా హిట్ కొడతాడో లేదో చూడాలి. మరోవైపు శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు..త్వరలో భగవంత్ కేసరి సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇంకా మహేశ్ తో గుంటూరు కారం, పవన్ తో ఓ సినిమాలోను నటిస్తోంది ఈ బ్యూటీ.
Also Read: Game Changer Update: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి క్రేజీ అప్డేట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి