Hollywood actor Jennifer Lawrence says Anybody can go look at my naked body: హాలీవుడ్‌ నటి 'జెన్నిఫర్ లారెన్స్‌' ()Jennifer Lawrence గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ది హాంగర్ సిరీస్, ఎక్స్ మెన్ డేస్ సిరీస్, సిల్వర్ లైనింగ్స్ ప్లే బుక్, పాసెంజర్స్, రెడ్ స్పారో, వింటర్స్ బోన్, మథర్, ఎవెంజర్స్, జాయ్, సెరెనా, ది పోకర్ హౌస్ వంటి చిత్రాలతో ప్రత్యక గుర్తింపు తెచ్చుకున్నారు. తన అందం, నటనతో జెన్నిఫర్ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె 'డోంట్‌ లుక్ అప్‌' (Don’t Look Up) సినిమాతో బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో జెన్నిఫర్ లారెన్స్‌ గతంలోని చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 నా నగ్న శరీరాన్ని ఎప్పుడైనా చూడొచ్చు:
'డోంట్‌ లుక్ అప్‌' (Don’t Look Up) సినిమా ప్రమోషన్‌లో భాగంగా 2014, 2017లో జరిగిన సంఘటనలను జెన్నిఫర్ లారెన్స్‌ (Jennifer Lawrence) గుర్తుచేసుకున్నారు. 2014లో ఆన్‌లైన్‌లో లీక్‌ అయిన తన నగ్న ఫొటోల కారణంగా ఇప్పటికీ మానసిక ఒత్తిడికి గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. 'నా అంగీకారం లేకుండా.. ఎవరైనా నా నగ్న శరీరాన్ని (naked body ఎప్పుడైనా చూడొచ్చు. ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి నా పోటోలను పోస్ట్ చేశాడు. నా గాయం మాత్రం ఎన్నటికీ మానదు' అని జెన్నిఫర్ అన్నారు. ఎందరో సెలబ్రిటీలకు సంబంధించిన దాదాపు 500 ప్రైవేట్‌ ఫొటోలను 2014లో హ్యాకర్లు ఆన్‌లైన్‌లో లీక్‌ చేశారు. అందులో సింగర్‌ రిహన్నా, సెలీనా గోమెజ్‌లతో పాటు జెన్నిఫర్‌ ఫొటోలు కూడా ఉన్నాయి.


రెండు ఇంజిన్లు ఫెయిల్‌ కావడంతో:
జెన్నిఫర్ లారెన్స్‌ (Jennifer Lawrence) 2017లో జరిగిన విమాన అనుభవం గురించి కూడా చెప్పారు. తన స్వస్థలమైన లూయిస్ విల్లే-కెంటక్కీ నుంచి న్యూయార్క్‌కు ఒక ప్రైవేట్‌ విమానంలో జెన్నిఫర్ బయలుదేరారు. ఆ సమయంలో విమానంలోని రెండు ఇంజిన్లు ఫెయిల్‌ కావడంతో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్పుడు తాను చనిపోతానని  భావించినట్టు ఆమె పేర్కొన్నారు. 'నా అస్థి పంజరం సీటులో ఉండిపోతుంది అని నేను నా కుటుంబానికి వాయిస్‌ మేయిల్స్‌ ఇవ్వడం మొదలు పెట్టాను. నేను గొప్ప జీవితాన్ని గడిపాను, నన్ను క్షమించండి అని కూడా చెప్పా' అని తన అనుభవాన్ని జెన్నిఫర్ పంచుకున్నారు.  


డికాప్రియోతో కలిసి:
ప్రస్తుతం 31 ఏళ్ల జెన్నిఫర్‌ లారెన్స్‌ (Jennifer Lawrence) త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న 'డోంట్‌ లుక్ అప్‌' ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ సెటైరికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ బ్లాక్‌ కామెడీ చిత్రంలో లియోనార్డో డికాప్రియో (Leonardo DiCaprio)తో కలిసి ఆమె ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 10న థియేటర్లలో విడుదలవనుంది. అలాగే డిసెంబర్‌ 24 నుంచి ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇక ఈ ప్రకటన చూసిన నెటిజన్లు 'జెన్నిఫర్ లారెన్స్‌ బంపర్ ఆఫర్ ఇచ్చారుగా' అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


న్యూడ్ చిత్రాలు లీక్ అవ్వగానే:
2014లో హాలీవుడ్ సెలబ్రిటీల ఐక్లౌడ్ ఖాతాలను హ్యాక్ చేస్తూ.. వారి నగ్న చిత్రాలను జార్జి గర్ఫానోని అనే వ్యక్తి సేకరించి బ్లాక్ మెయిల్ చేశాడు. లొంగని సెలబ్రిటీల చిత్రాలను మాత్రం ఇంటర్నెట్‌లో లీక్ చేశాడు. తొలుత సెలబ్రిటీల ఫోటోలు మాత్రమే సేకరించిన అతడు ఆ తర్వాత 240 మంది సామాన్య అమ్మాయిల చిత్రాలను కూడా సంపాదించాడు. అందులో కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగినులు కూడా ఉన్నారు. హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ (Jennifer Lawrence) తన న్యూడ్ చిత్రాలు లీక్ అవ్వగానే.. పోలీసులను ఆశ్రయించి కేసును నమోదు చేశారు. పోలీసులు సైబర్ నిపుణులు నిఘా వ్యవస్థను పటిష్టం చేసి జార్జిని పట్టుకున్నారు. జార్జి చేసిన నేరాలు అంగీకరించడంతో కోర్టు అతనికి శిక్షను విధించింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook