Mahesh-Rajamouli Movie Updates: జక్కన్న రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.  ఈ సినిమా కోసం రాజమౌళి ఓ ప్రముఖ హాలీవుడ్ నటుడిని రంగంలోకి దించబోతున్నట్లు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎవెంజర్స్​, స్టార్​ వార్స్​, ఎక్స్​ఎక్స్​ఎక్స్​, జురాసిక్​ పార్క్​, స్పైడర్​ మ్యాన్, కెప్టెన్​ అమెరికా​ వంటి సూపర్ హిట్​ చిత్రాల్లో నటించిన హాలీవుడ్ యాక్టర్ శామ్యూల్​ ఎల్​ జాక్స్​ను (Samuel L Jackson) తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నటుడు ప్రతి సినిమాకు రూ.80 కోట్లు నుంచి 160 కోట్లు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తాడు. రాజమౌళి సినిమాలో ఇతడు ఉన్నాడో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 


'ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ' అంటూ ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చేశారు రాజమౌళి. ఈ చిత్రం యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కబోతుంది. ఈ మూవీని కె.ఎల్‌.నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ జోడిగా శ్రద్ధ కపూర్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి చిత్రబృందం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన జక్కన్న.. మరి మహేశ్ తో ఎలాంటి అద్భుతం చేస్తాడో వేచి చూడాలి.


Also Read: Cobra OTT Release Date: విక్రమ్‌ 'కోబ్రా' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... ఎప్పుడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.        


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook