Honey Rose to Act in NBK 108: నందమూరి బాలకృష్ణ హీరోగా వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పోటీగా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమాతో పోలిస్తే వెనకబడే ఉన్నా నందమూరి బాలకృష్ణ కెరియర్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలుస్తూ ఈ సినిమా ముందుకు దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా మలయాళ భామ హనీ రోజ్ తో పాటు శృతిహాసన్ కూడా నటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శృతి హాసన్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు హనీ రోజ్ గురించి మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే హనీ రోజ్ తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని భావిస్తున్న నందమూరి బాలకృష్ణ ఆమెను తన తదుపరి సినిమాకి కూడా రికమెండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ కెరియర్ లో 107వ సినిమాగా వీరసింహారెడ్డి సినిమా తెరకెక్కగా 108వ సినిమాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది.


ఈ సినిమాలో హీరోయిన్గా హనీ రోజ్ ని తీసుకోమని నందమూరి బాలకృష్ణ రికమండ్ చేశారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో కూడా హనీ రోజ్ పాల్గొన్నారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో ఏదో తాగుతున్నట్లుగా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వారి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందనే ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే నందమూరి బాలకృష్ణ తనతో పని చేసే వారందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు.


అప్పుడెప్పుడో తెలుగులో కొన్ని సినిమాల్లో కనిపించి తర్వాత మాయమైపోయి కేవలం మలయాళ సినిమాలకు మాత్రమే పరిమితం అయిపోయి అవే చేసుకుంటున్న హనీ రోజ్కి నందమూరి బాలకృష్ణ సపోర్ట్ తో తెలుగులో మరిన్ని అవకాశాలు దక్కుతాయనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించి ఇప్పటికే పాత్రధారుల ఎంపిక జరిగిపోయిందని అసలు ఈ సినిమాలో హీరోయిన్ అవకాశమే ఉండదని మరో ప్రచారం అయితే జరుగుతోంది. అందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది సినిమా యూనిట్ క్లారిటీ ఇస్తే తప్ప తెలియదు.
Also Read: Shooting Updates: పుష్ప 2, రావణాసుర సహా తెలుగు సినిమాల షూటింగ్ అప్డేట్స్


Also Read; VSR vs WV Collections: మాంచి జోరు మీద వీరయ్య.. 41 కోట్ల తేడాతో వీర సింహ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook