Adipurush: ముందు హృతిక్ రోషన్ కు కథ వినిపించారట
బాహుబలి ( Baahubali ) తరువాత ఆ లెవల్ లో ప్రభాస్ (Prabhas ) చేస్తున్న మరో చిత్రం ఆదిపురుష్. ఈ మూవీకి సంబంధించి మరో వార్త ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.
బాహుబలి ( Baahubali ) తరువాత ఆ లెవల్ లో ప్రభాస్ ( Prabhas ) చేస్తున్న మరో చిత్రం ఆదిపురుష్. ఈ మూవీని టి సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తోండగా.. ఓం రావత్ దర్శకత్వం వహించనున్నారు. తానాజీ మూవీని తెరకెక్కించిన ఓం రావత్ ఆదిపురుష్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ మూవీకి కనీసం రూ.1000 కోట్ల బడ్జెట్ ఉండనుంది అని ..అదిపురుష్ చిత్రంతో ప్రభాస్ హాలీవుడ్ హీరో అవుతాడు అని ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ( Krishnam Raju ) తెలిపాడు. అయితే ఈ మూవీకి సంబంధించి మరో వార్త ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.
ఈ మూవీని ముందు శ్రీ రాముడి జన్మస్థలం అయిన అయోధ్య పేరుతో అయోధి అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారట. అయితే తరువాత ఆదిపురుష్ ( Adipurush ) అనే టైటిల్ ఫిక్స్ చేశారట. అదిపురుష్ చిత్రం కథను ముందు బాలీవుడ్ గ్రీకు సుందరుడు హృతిక్ రోషన్ ( Hrithik Roshan ) కు వినిపించారట. కానీ అతను తప్పుకున్నాడట. బాహుబలి తరువాత ప్రభాస్ క్రేజ్ చూసి ప్రభాస్ ఈ మూవీకి కరెక్ట్ అని ప్రభాస్ కు కథ వినిపించగా ప్రభాస్ సరే అన్నాడట. ఆదిపురుష్ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడతో పాటు మరిన్ని భాషల్లో ఈ చిత్రం విడుదల చేయనున్నారట. అదిపురుష్ చిత్రీకరణ 2021 ప్రారంభం కానుంది. 2022లోసినిమా విడుదల కానుంది.