Hyderabad Traffic Police stops Tollywood Hero Jr NTR's Car: హైదరాబాద్ మహా నగరంలో బ్లాక్ ఫిలింతో ప్రయాణిస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.  ఆదివారం జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‏స్పెక్టర్ ముత్తు ఆధర్వంలో జూబ్లీ చెక్‏పోస్ట్ వద్ద పలు వాహనాలను తనిఖీ చేసి.. బ్లాక్ ఫిలిం తెరలను తొలగించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కారును ఆపి తనిఖీ చేశారు. అనంతరం అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించి పంపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు జరుగుతున్న సమయంలో వాహనంలో డ్రైవర్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు, మరో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనలను విరుద్ధంగా ఎన్టీఆర్ కారుకు బ్లాక్ ఫిల్మ్ టింట్ ఉన్నందునే కారును ఆపి.. దాన్ని తొలగించారు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‏లో బిజీగా ఉన్నారు. ఈరోజు యంగ్ టైగర్ ఢిల్లీలో ఉన్నారు. ఆయనతో పాటుగా దర్శకధీరుడు రాజమౌళి, హీరో రామ్ చరణ్ కూడా ఉన్నారు. 


లైసెన్స్ ప్లేట్లు సరిగా లేని వాహనాలపై ఆదివారం ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గువ్వల బాలరాజు, మేరాజ్ హుస్సేన్, శ్రీధర్ రెడ్డి పేర్లపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్లను కూడా పోలీసులు తొలగించారు. వివిధ ఉల్లంఘనలకు సంబంధించి 90 వాహనాలపై మోటారు వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ ముత్తు తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లో వీధి వ్యాపారులను ఎమ్మెల్యే కారు ఢీకొట్టడంతో రెండున్నర నెలల పసికందు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు.


దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25న విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను డివీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డివీవీ దాన‌య్య నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా సరణ్, ఓలియా మోరిస్ తదితరులు నటించారు. ఈ పాన్ ఇండియా సినిమా కోసం సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.


Also Read: Taskin Ahmed: మార్క్ వుడ్ స్థానంలో టస్కిన్‌ ఆహ్మద్‌.. బంగ్లా పేసర్ టీ20 గణాంకాలు ఇవే!!


Also Read: Shabaash Mithu Teaser: శభాష్‌ మిథు టీజర్ వచ్చేసింది.. బ్లూ జెర్సీలో మెరిసిన తాప్సీ! రవిశాస్త్రి అదుర్స్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook