Nagarjuna: N - కన్వెన్షన్ కూల్చివేత.. కోర్టులో తేల్చుకుంటానంటున్న నాగార్జున..!
Nagarjuna Reacts in N Convention Demolish : హైదరాబాదులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో తుమ్మిడి కుంట చెరువు సమీపంలో ఉన్న ఎన్ కన్వెన్షన్ హాల్ ను అధికారులు కూల్చివేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నాగార్జున , కోర్టును ఆశ్రయిస్తానంటూ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
Nagarjuna responds on n convention center : తాజాగా హైడ్రా హైదరాబాదులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తుమ్మిడికుంట చెరువు సమీపంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అక్కినేని ఎన్ కన్వెన్షన్ హాల్ ను అధికారులు కూల్చివేశారు. మూడున్నర ఎకరాలను కబ్జా చేసి ఆక్రమంగా నిర్మాణాలు చేపట్టారు అన్న కారణంతో ఈ కన్వెన్షన్ హాల్ ను కూల్చివేశారు.
అయితే ఈ కన్వెన్షన్ హాల్ కూల్చివేతపై హాల్ అధినేత, ప్రముఖ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయిస్తామని ఒక నోట్ విడుదల చేశారు. నాగార్జున ఆ నోట్లో తెలిపిన వివరాల మేరకు.. కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ కు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడం చట్టరీత్యా నేరం. మా ప్రతిష్టను కాపాడడం కోసం , ముఖ్యంగా కొన్ని వాస్తవాలను మీకు తెలియజేయడం కోసం, ఈ మేరకు ఈ ప్రకటన జారీ చేయడం సరైనదే అంటూ నేను భావిస్తున్నాను అంటూ నాగార్జున తెలిపారు.
ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించిన స్థలం మొత్తం పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదు. ప్రైవేట్ స్థలంలో దాన్ని నిర్మించాము. అయితే గతంలో కూల్చి వేస్తున్నట్లు అక్రమంగా నోటీసులు పంపించినా.. దానిపై కోర్టు స్టే విధించింది.
చట్ట విరుద్ధంగా తప్పుడు సమాచారంతో ఎన్ కన్వెన్షన్ హాల్ ను స్టే ఆర్డర్ కి వ్యతిరేకంగా అధికారులు అక్రమానికి పాల్పడ్డారు. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు. అసలు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం పద్ధతి కాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, ఒకవేళ నేను వ్యతిరేకంగా ఈ భవనాన్ని నిర్మించినట్లు కోర్టు నాకు తీర్పునిస్తే, ఈ భవనాన్ని కూల్చివేయడానికి నేనే ముందుండేవాడిని.
ఎటువంటి సమాచారం లేకుండా.. కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని , ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రయత్నం చేశారు. ఇక ప్రజలలో ఈ తప్పుడు అభిప్రాయాన్ని పోగొట్టడమే మా ప్రధాన ఉద్దేశం.
చట్టవిరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా అధికారులు చేసిన ఈ పనిని మేము సమర్థించడం లేదు. కచ్చితంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము. తప్పకుండా మాకు కోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాము అంటూ తెలిపారు నాగార్జున. ప్రస్తుతం నాగార్జున షేర్ చేసిన ఈ నోట్ పై కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి.
Also Read: YS Jagan: తొలిసారి జగన్ విశాఖ పర్యటన.. సీఎంగా ప్రమాణం చేస్తానన్న చోట అధికారం కోల్పోయి
Also Read: Tirumala Water Problem: తిరుమలలో నీటి సంక్షోభం.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter