Hyper Aadi with Shraddha Das బుల్లితెరపై హైపర్ ఆది చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పంచ్‌లు, ప్రాసలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే ఆది ఎప్పుడూ ఎవరో ఒకరితో రొమాంటిక్ ట్రాక్, లవ్ ట్రాక్ నడిపించాలని చూస్తుంటాడు. తన రాసుకునే స్క్రిప్టులే కాబట్టి.. తనకు నచ్చినవారితో ట్రాక్ సెట్ చేసుకుంటాడనిపిస్తుంది. అవి జనాలకు కూడా బాగానే కనెక్ట్ అవుతుండటంతో ఆది రెచ్చిపోతూ ఉంటాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదట్లో జబర్దస్త్ షోలో అనసూయతో ట్రాక్ నడిపించాడు. అనసూయ మీద కోరిక ఉన్నట్టుగానే స్కిట్లలో డైలాగ్స్ పేల్చే వాడు. తనకు పెళ్లి అయిందని, భర్త ఉందని అనసూయతో డైలాగ్స్ చెప్పిస్తూనే ఆది మాత్రం తనర కోరికలను బయటపెట్టేవాడు. హగ్గులు, కిస్సుల కోసం స్కిట్లలో సీన్లు కూడా రాసుకుంటూ ఉండేవాడు. అయితే అదంతా సరదాకే అని తెలిసినా కూడా వారిద్దరి కెమిస్ట్రీ బాగుండటంతో జనాలు కూడా ఎంజాయ్ చేసేవారు.


ఆ తరువాత ఆది ఢీ షోలో ప్రియమణితో నానా హంగామా చేసేవాడు. ఆదిని ప్రియమణి బావా అని పిలిచేది. అలా ఈ ఇద్దరి చేష్టలు అయితే జనాలను విసిగెత్తించాయి. ప్రియమణితో హగ్గులు, ముద్దులు అంటూ ఆది హంగామా చేస్తుండేవాడు. అయితే ఇప్పుడు శ్రద్దా దాస్‌ మీద ఆది తన  ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ఢీ ప్రోమోలో ఆదిని పాట పాడేసి పడగొట్టేసింది శ్రద్దా దాస్.


 



నిన్నేనా? నేను చూస్తోంది నిన్నేనా? అంటూ పాట పాడింది శ్రద్దా దాస్. ఆది సైతం చివర్లో వంత పాడాడు. నిజంగా చెబుతున్నాను శ్రద్దా.. ఐ లవ్యూ అని ప్రపోజ్ చేశాడు ఆది. దీంతో తెగ సిగ్గుపడుతూ నవ్వేసింది శ్రద్దా దాస్. ఢీ షోలో డ్యాన్సులు ఎలా ఉన్నా కూడా ఈ ట్రాకులు, శేఖర్ మాస్టర్ మీద వేసే జోకులు, ఆది చేసే ఈ చిలిపి పనులు మాత్రం ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.


ఇక ఇదే ప్రోమోలో ఆది వేసిన స్పూప్‌, ఛత్రపతిలో ప్రభాస్‌లా నటించేందుకు పడ్డ కష్టాలు, శ్రద్దా దాస్ మీద చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. ఇక జెస్సీని మాత్రం కంటిన్యూగా బక్రాను  చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. గత సీజన్‌లో అఖిల్ ఈ సీజన్‌లో జెస్సీ అన్నట్టుగా తయారైంది.


Also Read:  Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా


Also Read: Pragya Jaiswal Bikini : బాలయ్య భామ బికినీ ట్రీట్.. వెనకాల జరిగే పనులపై నెటిజన్ల ట్రోల్స్.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook