Dhamaka First Review మాస్ మహారాజా రవితేజ ధమాకా చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. క్రాక్ సినిమాతో గత ఏడాది కరోనా సమయంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. అయితే ఆ అంచనాలతో వచ్చిన ఖిలాడీ సినిమా దారుణంగా బెడిసి కొట్టేసింది. మరి ఇప్పుడు ధమాకా అంటూ రాబోతోన్నాడు. ఆ తరువాత కూడా వరుసపెట్టి సినిమాలను చేస్తున్నాడు రవితేజ. ధమాకా చిత్రం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం నాడు నిర్వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధమాకా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైపర్ ఆది సందడి చేశాడు. రైటర్ ప్రసన్న, డైరెక్టర్ త్రినాథరావు నక్కినతో ఆదికి మంచి బంధం ఉంది. డైలాగ్ రైటింగ్‌లోనూ ఆది సాయం చేస్తుంటాడు. అయితే ఈ చిత్రంలో ఆది ఓ పాత్రను పోషించాడట. ఇక ఈ సినిమాను ఆల్రెడీ ఆడియెన్‌గా చూసేశాడట ఆది. అందుకే ఈ సినిమా రివ్యూని తన స్టైల్లో చెప్పేశాడు. 


సినిమా అదిరిపోయిందని రవితేజ నటన, శ్రీ లీల అందం, భీమ్స్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రసన్న డైలాగ్స్, త్రినాథరావు డైరెక్షన్ ప్లస్ పాయింట్స్ అని, సినిమా అప్పుడే అయిపోయిందా? ఇంకాసేపు ఉంటే బాగుండేది అని ప్రేక్షకులకు అనిపిస్తుందట. అదే నెగెటివ్ పాయింట్ అని ఆది చెప్పుకొచ్చాడు. అలా ధమాకా ఫస్ట్ రివ్యూని ఆది చెప్పేశాడు.


ఇక శ్రీలీలను చూస్తే లవర్ లేని వాళ్లకు ఇలాంటి లవర్ ఉండాలని అనిపిస్తుందట. లవర్ ఉన్న వాళ్లకి అయితే.. ఇలాంటి లవర్ ఉంటే బాగుండు అని అనిపిస్తుందట. నీకు ఎలా అనిపిస్తుంది? అని ఆదిని స్టేజ్ మీదే ఇరికించే ప్రయత్నం చేసింది సుమ. నాకు కూడా అలాంటి ఫీలింగే ఉంది అని శ్రీలీల లాంటి లవర్ కావాలని చెప్పకనే చెప్పేశాడు ఆది.


Also Read : Avatar 2 Box Office Collections : అవతార్ 2 సునామీ.. కలెక్షన్లు చూస్తే కచ్చితంగా షాక్ అవుతార్


Also Read : Samantha Ruth Prabhu : సమంత ఇక సినిమాలకు పూర్తిగా దూరం అవుతుందా?.. ఆ ఒక్కటి మాత్రం పూర్తి చేసేస్తుందట!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook