Buy Second Hand Hyundai Creta Only Rs Under 9 Lakhs: కొత్త కారు కొనడానికి బడ్జెట్ ఎక్కువగా లేకుండి.. కారు కొనడం అవసరం అయితే ఒక వ్యక్తి సాధారణంగా పాత కారు కొనడానికి చూస్తాడు. సామాన్య ప్రజలు ఎక్కువగా పాత కార్లను మాత్రమే కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. కారణం ఏమైనప్పటికీ మీరు సెకండ్ హ్యాండ్ కారుని కొనుగోలు చేయాలనుకుంటే.. అది కూడా హ్యుందాయ్ క్రెటాను కొనుగోలు చేయాలనుకుంటే మంచి ఆప్షన్ ఉంది. కార్స్ 24 వెబ్‌సైట్‌లో  కొన్ని సెకండ్ హ్యాండ్ హ్యుందాయ్ క్రెటా కార్లు ఉన్నాయి. వీటి ధర సుమారు రూ. 8 లక్షలుగా ఉంది. పాత కార్లు కాబట్టి రోడ్డు పన్ను చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2015 Hyundai Creta 1.6 S MANUAL:
2015 హ్యుందాయ్ క్రెటా 1.6 S మాన్యువల్ ధర కార్స్ 24 వెబ్‌సైట్‌లో రూ.7,96,000లుగా ఉంది. ఇది పెట్రోల్ ఇంజిన్‌తో ఆధారితమైనది. మొత్తం 31,824 కిలోమీటర్లు నడిచిన ఈ కారు ప్రస్తుతం మొదటి యజమాని వద్ద ఉంది. దీని సంఖ్య DL-8C నుంచి ప్రారంభమవుతుంది. నోయిడాలో ఈ కారు విక్రయానికి అందుబాటులో ఉంది.


2015 Hyundai Creta 1.6 S MANUAL:
మరో 2015 హ్యుందాయ్ క్రెటా 1.6 S మాన్యువల్ కారు మొత్తం 27,923 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ కారు ధర రూ.8,13,000. ఈ పెట్రోల్ ఇంజిన్ కారు ప్రస్తుతం మొదటి యజమాని వద్ద ఉంది. ఈ కారు సంఖ్య UP-32 నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు నోయిడాలో అమ్మకానికి అందుబాటులో ఉంది.


Also Read: Mahindra XUV400 Errors: మహీంద్రా ఎక్స్‌యూవీ400లో 3 లోపాలు.. కొనుగోలు చేసే ముందు తప్పక తెలుసుకోండి!


2015 Hyundai Creta 1.6 SX (O) CRDI MANUAL:
2015 హ్యుందాయ్ క్రెటా 1.6 SX (O) CRDI మాన్యువల్ కారు ధర కార్స్ 24 వెబ్‌సైట్‌లో రూ.8,35,000గా ఉంది. 44,445 కిలోమీటర్ల రీడింగ్ ఉన్న ఈ కారు మొదటి యజమాని వద్ద ఉంది. ఈ డీజిల్ ఇంజిన్ కారు సంఖ్య HR-10తో ప్రారంభమవుతుంది. ఇది నోయిడాలో అమ్మకానికి అందుబాటులో ఉంది.


2015 Hyundai Creta SX PLUS 1.6:
2015 హ్యుందాయ్ క్రెటా SX PLUS 1.6 పెట్రోల్ ధర రూ. 8,40,000గా ఉంది. ఇది మొత్తం 23,796 కిలోమీటర్లు నడిచింది. ప్రస్తుతం మొదటి యజమాని వద్ద ఈ కారు పెట్రోల్ ఇంజన్తో నడుస్తుంది. ఈ కారు నోయిడాలో మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంది.


Also Read: Kia Carens 2023: కియా నుంచి సరికొత్త 7-సీటర్ కారు విడుదల.. ఫీచర్లు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి