John Abraham Sensational Comments on Tollywood: మోడలింగ్ రంగం నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టి... భిన్న కథాచిత్రాలతో మెప్పిస్తున్న యాక్షన్‌ హీరో జాన్ అబ్రహం. తాజాగా జాన్ నటించిన ఎటాక్‌ చిత్రం ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రమోషన్ ఈవెంట్స్‌లో భాగంగా జాన్ అబ్రహం తెలుగు సినిమాలపై చేసిన ఓ కామెంట్ వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సలార్‌ మూవీలో జాన్‌ అబ్రహం కీలకపాత్ర పోషించనున్నారంటూ.. గత కొద్ది రోజులుగా జోరుగా చర్చ సాగుతోంది. ఈ అంశంపై చిత్రబృందం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో  సలార్‌ చిత్రంలో సపోర్టింగ్‌ రోల్‌ చేస్తున్నారా..? అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా జాన్‌ సమాధానమిచ్చారు. 


ఇతర నటీనటుల మాదిరిగా తెలుగు, ఇతర ప్రాంతీయ భాషా చిత్రంలో నేనెప్పటికీ నటించను. నేనొక హిందీ సినిమా హీరోని. నటుడ్ని కాబట్టి ఏదో ఒక సినిమాలో స్క్రీన్‌పై కనిపించాలని.. సెకండ్‌ హీరోగా చేయను అని జాన్‌ స్పష్టంచేశాడు. ప్రస్తుతం జాన్‌ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. జిస్మ్‌‌తో వెండితెరకు పరిచయమైన బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం. ధూమ్‌, రేస్‌, కాబుల్ ఎక్స్‌ప్రెస్, మద్రాస్ కఫే, హౌజ్‌ఫుల్‌ 2, సత్యమేవజయతే వంటి పలు సినిమాలతో అలరించారు. నిర్మాతగానూ పలు చిత్రాలు తెరకెక్కించారు.


Also Read: Will Smith: విల్ స్మిత్‌పై చర్యలు తప్పవా..? ఉత్తర నటుడి అవార్డు కోల్పోనున్నాడా..?


Also Read: Ramdev on Petrol: నోరు మూసుకో.. మళ్లీ అడిగితే బాగుండదు! లైవ్‌లోనే జర్నలిస్టుపై రామ్‌దేవ్‌ ఫైర్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook