Sobhita Dhulipala Mohtherhood: తనకు కాబోయే భర్త అక్కినేని నాగచైతన్యతో పిల్లలను కనాలని ఉందని.. అమ్మ ప్రేమ తాను పొందాలని సినీ నటి శోభిత ధూళిపాల సంచలన ప్రకటన చేశారు. తనకు తెలుగు ప్రాంతం అంటే ఎంతో ఇష్టమని తెలిపిన ఆమె.. తాను అక్కినేని కోడలిగా గర్వపడుతున్నట్లు తెలిపారు. నిశ్చితార్థం అంగరంగ వైభవంగా ఊహించలేదని.. తీయగా.. నిరాడంబరంగా జరిగిందని తాను అనుకున్న రీతిలో జరిగిందని గుర్తు చేసుకున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR Comments on Devara: దేవర ఈవెంట్ రద్దుపై కేటీఆర్ సంచలన కామెంట్స్..


ఆగస్టు 9వ తేదీన హైదరాబాద్‌లో నాగచైతన్యతో శోభిత నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. నిశ్చితార్థం జరిగిన దాదాపు నెలన్నర రోజుల తర్వాత శోభిత నోరు విప్పారు. ఓ హిందీ చానల్‌తో జరిగిన ఇంటర్వ్యూలో శోభిత తన నిశ్చితార్థంపై స్పందించారు. ఈ సందర్భంగా నిశ్చితార్థం.. వివాహ జీవితం.. సినిమాలు తదితర విషయాలపై శోభిత మాట్లాడారు. ఈ క్రమంలోనే చైతూపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Devara: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఎన్టీఆర్ దేవర రచ్చ.. ఫస్ట్ డే ఆ హీరోల రికార్డ్స్ ఫసక్..


'నేను ఎన్నో కలలు.. ప్రణాళికతో ఆ క్షణం కోసం (నిశ్చితార్థం) కోసం ఎదురుచూడలేదు. ఆ క్షణాన్ని ఆస్వాదించా. ప్రశాంతంతా జరిగిపోయింది. నేను అనుకున్నట్టుగానే జరిగింది. నాకు ఆనందం కలిగించిన క్షణాలు జరిగినప్పుడు ఎలాంటి అలంకారం అవసరం లేదని నేను భావిస్త. ఆ క్షణమే చాలు అనిపిస్తుంది. అందుకే ఎలా జరిగిందనే భావన నాకు ఏర్పడదు. ఎలా జరగాలో అలా జరిగింది. అది చక్కగా జరిగింది' అని శోభిత తెలిపింది.


అమ్మను కావాలి
అమ్మ కావాలని.. తెలుగు ప్రాంతంపై శోభిత స్పందిస్తూ.. 'అమ్మతనాన్ని ఆస్వాదించాలని.. పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకునేదాన్ని. దానిపై నాకు స్పష్టత ఉంది. ఎప్పుడూ అందులో నన్ను నేను చూసుకునేదాన్ని. ఈ క్షణాల్లో తెలుగుతనం ఉట్టి పడాలని అనుకునేదాన్ని. నా తల్లిదండ్రులు, సంప్రదాయాలు, నా మూలాలతో నేనెప్పుడూ మమేకమయ్యే ఉన్నా' అని శోభిత వెల్లడించింది.


ఆ చీర కట్టుకుంటా
పెళ్లిపై శోభిత ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు ఆమె మాటల ద్వారా తెలుస్తోంది. పెళ్లికి ఏ చీర కట్టుకోవాల్నో ఇప్పటి నుంచే ప్లాన్‌లో ఉంది. 'తెలుగు వివాహాల్లో అమ్మాయిలు ఎర్రటి అంచు ఉండే తెల్లటి చీర కట్టుకోవడం సాధారణం. నేను కూడా అలాంటిదే కట్టుకోవాలని అనుకుంటున్నా' అని శోభిత పంచుకుంది. కాగా చైతూ, శోభిత నిశ్చితార్థమై రెండు నెలలు అవుతున్నా ఇంకా పెళ్లిపై ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ ఏడాది చివరలో కానీ.. జనవరి, ఫిబ్రవరిలో పెళ్లి జరిగే అవకాశం ఉందని సమాచారం.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.