విజయ్ సీఎం అయితే సంతోషిస్తా..!
చెన్నై : నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే మహేష్ బాబు నటించిన "స్పైడర్" చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషించిన ఆయన ఈ మధ్యకాలంలో తమిళ హీరో విజయ్ నటించిన "మెర్సల్" చిత్రంలో కూడా విలన్‌గా నటించారు. ఈ క్రమంలో ఒక టీవీ ఛానల్ వారు నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ "నటులు పాలిటిక్స్‌లోకి రాకూడదని నియమం ఏమీ లేదు.ఈ స్వతంత్ర భారతదేశంలో రాజకీయాల్లోకి వచ్చే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మంచి చేయాలనుకొనే ప్రతీ ఒక్క వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయవచ్చు. నా స్నేహితుడు హీరో విజయ్ ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తాను. ఆయన సీఎం అయితే మరీ సంతోషిస్తాను. ఆయన ఒక బాధ్యత గల పౌరుడు" అని తెలియజేశారు.