ibomma Telugu Web Site Shutting Down soon: ఐబొమ్మ.. సినీ ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. థియేటర్‌లో భారీగా డబ్బులు పెట్టి సినిమా చూడని మధ్యతరగతి వారికి ఇది మంచి వేదిక. ఒకప్పుడు సినిమా కోసం థియేటర్లకు వెళ్లే సినీ అభిమానులు ఐబొమ్మ పుణ్యమాని ఇప్పుడు ఇంట్లోనే ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉన్నా.. సబ్‌స్క్రిప్షన్ బాదుడు తట్టుకోలేక ప్రతిఒకరు హెచ్‌డీ ఫార్మాట్‌లో సినిమాలను అందజేసే ఐబొమ్మ వైపు చుస్తునారు. అందుకే ఐబొమ్మ చాలా ఫేమస్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఐబొమ్మ కథ త్వరలోనే ముగిసిపోనుందట. ఈ విషయాన్ని ఐబొమ్మ యాజమాన్యం తన వెబ్‌సైట్ పేజీలో పెద్ద నోట్ రూపంలో చెప్పింది. తమపై వస్తున్న అసత్య ప్రచారం, ట్రోల్‌ కారణంగానే వెబ్‌ సర్వర్‌ను షెట్‌డౌన్ చేస్తున్నాం అని స్పష్టం చేసింది. కేవలం పాషన్‌తోనే ఇదంతా చేస్తున్నామని పేర్కొంది. వాస్తవానికి గత కొన్ని రోజులుగా యూజర్ల డేటాను అమ్ముతున్నారని ఐబొమ్మపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు సినీ పెద్దల నుంచి కూడా పలు విమర్శలు వస్తున్నాయి. అందుకే ఐబొమ్మ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఏదేమైనా సినీ ప్రియులకు ఇది కచ్చితంగా చేదువార్త అనే చెప్పాలి. 


'స్పష్టంగా చెప్పాలంటే క్లౌడ్ సర్వర్లను 99.999% అప్టమ్‌ మరియు బ్యాండ్ విడ్త్ ఖర్చులతో నిర్వహించడం చాలా కష్టం. కానీ ఇప్పటికీ ఏదో ఒకవిధంగా మేము మా బుర్ర ఉపయోగించి మేనేజ్ చేస్తున్నాం. మీ మొబైల్‌లో మాల్వేర్లను అటాచ్ చేసి డేటాను కంపెనీలకు అమ్మి చాలా డబ్బు సంపాదిస్తున్నామని మాపై అసత్య ప్రచారం జరుగుతోంది. మా హార్డ్‌ వర్క్‌ గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఈ సైట్‌ మీద మేము సంపాదించింది జీరో. ఈ ప్రాజెక్ట్ కోసం స్వంత డబ్బును పెట్టుబడి పెట్టాం. కానీ ఎవరికీ ఆ విషయాలు అక్కరలేదు' అని ఐబొమ్మ యాజమాన్యం నోట్‌లో పేర్కొంది. 


'సాధారణంగా మేము అలాంటి విషయాలను మేము పెద్దగా పట్టించుకోము. కానీ మా వినియోగదారులు మద్దతు ఇవ్వడం లేదు. పైగా సగం సగం జ్ఞానం కలిగిన యూట్యూబర్లు, సోషల్ మీడియా సైట్స్ రాసే కథనాలు వారిని ప్రభావితం చేశాయి. మేము మా జీవితంలో వినోదం మరియు సవాళ్లను ఇష్టపడే దీన్ని మెయిటైన్ చేస్తున్నాం. మా సైట్ బ్యాంకింగ్ సైట్ వలె 100% సురక్షితం. నకిలీ సైట్, యాప్స్, యాడ్స్, ప్రమోషన్లు మొదలైన వాటి పట్ల జాగ్రత్త ఉండాలని హెచ్చరించాం. ప్రతి ఒక్కరూ ఉచిత సినిమా కంటెంట్ కోరుకుంటారు కానీ ఏ సోషల్ మీడియాలో మాకు మద్దతు ఇవ్వరు. అలాంటప్పుడు మేము ఎందుకు కష్టపడాలి. మాకు మద్దతు ఇవ్వని వినియోగదారులకు నాణ్యమైన కంటెంట్ ఎందుకు ఇవ్వాలి?. మేము ఈ దీన్ని నిర్వహించగలిగే వారికి అప్పగిస్తాము లేదా మా భారత్‌లో మూసివేసాము. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు' అని ఐబొమ్మ నోట్‌లో ఉంది. 


Also Read: Malaysia Masters: క్వార్టర్ ఫైనల్లోకి పీవీ సింధు.. చైనా ప్లేయర్‌తో అమితుమీ!


Also Read: IND vs ENG 1st T20: భారత్ బౌలింగ్ బాగున్నా.. తొలి టీ20లో ఇంగ్లండే గెలుస్తుంది!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook