IC814 Kandahar Hijack: వివాదాస్పదంగా వెబ్‌సిరీస్, కంటెంట్‌పై సమీక్షించనున్న నెట్‌ఫ్లిక్స్
IC814 Kandahar Hijack Controversy: ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలైన IC814 Kandahar Hijack వెబ్‌సిరీస్ వివాదాస్పదమైంది. కేంద్ర ప్రభుత్వ సమన్లు జారీ చేయడంతో నెట్‌ఫ్లిక్స్ స్పందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IC814 Kandahar Hijack Controversy: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వివాదాస్పద వెబ్‌సిరీస్ IC814 Kandahar Hijack కంటెంట్‌పై సమీక్ష జరగనుంది. ఈ వెబ్‌సిరీస్‌లోని కంటెంట్‌పై ఓ వర్గం నుంచి వస్తున్న వ్యతిరేకత నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం నెట్‌ఫ్లిక్స్ సంస్థకు సమన్లు జారీ చేసింది. అసలు వివాదమేంటి, ఎందుకు సమన్లు జారీ చేసిందో తెలుసుకుందాం.
1999లో జరిగిన కాందహార్ విమానం హైజాక్ ఘటనపై ఇప్పటి వరకూ మార్పులు చేర్పులతో చాలా సినిమాలు వచ్చినా యథాతధంగా పూర్తి స్థాయిలో ఏదీ రాలేదు. కధ పాతదైనా కొత్తదనంతో..అడుగడుగునా ఉత్కంఠ రేపే విధంగా సరికొత్తగా అనుభవ్ సిన్హా తెరకెక్కించారు. 6 ఎపిసోడ్స్‌తో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ ఒక్కొక్కటి 40-45 నిమిషాల నిడివితో ఉంటుంది. 1999లో ఖాట్మండూ నుంచి న్యూ ఢిల్లీకు బయలుదేరిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం IC814ను హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్తారు హైజాకర్లు. పాకిస్తాన్ హర్కత్ ఉల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఐదుగురు టెర్రరిస్తులు ఈ ఘటనకు పాల్పడతారు.
విమానంలోని భారతీయుల్ని విడిపించేందుకు అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఛీఫ్ మౌలానా మసూద్ అజహర్ సహా ముగ్గురు ఉగ్రవాదుల్ని విడుదల చేస్తుంది. ఈ ఘటన ఆధారంగా IC814 Kandahar Hijack తెరకెక్కింది. అయితే ఇందులో కంటెంట్ ఓ వర్గం మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉందనేది విమర్శ. ఐదుగురు టెర్రరిస్టుల్లో ఇద్దరిని భోలా, శంకర్ అనే హిందూ పేర్లతో పిలవడంపై అభ్యంతరం వ్యక్తమైంది. దాంతో కేంద్ర ప్రభుత్వం నెట్‌ఫ్లిక్స్ సంస్థకు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 29 న విడుదలైన ఈ వెబ్‌సిరీస్ బ్యాన్ చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలైంది.
ఈ నేపధ్యంలో వెబ్‌సిరీస్ కంటెంట్ సమీక్షించేందుకు నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర ప్రసార, మంత్రిత్వ శాఖతో నెట్‌ఫ్లిక్స్ ఇండియా అధిపతి సమావేశమయ్యారు. దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే కంటెంట్ ఉంటుందని కేంద్రానికి నచ్చజెప్పింది.
Also read: Mr Celebrity Movie: హీరోగా పరుచూరి బ్రదర్స్ మనవడు ఎంట్రీ.. ‘మిస్టర్ సెలబ్రిటీ’ టీజర్ చూశారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.