Akhanda Pre Release Event: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందిన మూడో చిత్రం ‘అఖండ’. డిసెంబరు 2న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను శనివారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో చిత్రబృందం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అతిథులు, ఫ్యాన్స్ మధ్య 'అఖండ' సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త ట్రైలర్​ను విడుదల చేశారు హీరో అల్లు అర్జున్​. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ గురించి, సినిమా గురించి అల్లు అర్జున్ మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

“బాలకృష్ణ ఈ స్థాయిలో ఉండటానికి రెండు కారణాలు. సినిమాపై ఆయనకు ఉన్న ఆసక్తి, డిక్షన్​. ఆయనలా డైలాగ్​లు ఎవరూ చెప్పలేరు. సీనియర్​ ఎన్టీఆర్​ తర్వాత ఆయనకు మాత్రమే ఇది సాధ్యం. బాలయ్య ఎప్పుడు రియాలిటీగా ఉంటారు. కల్మషం లేని వ్యక్తి. ఆయనలో నాకు నచ్చే క్వాలిటీ అదే. అందుకే ఆయనకు ఇంత పెద్ద ఫ్యాన్ ​ఫాలోయింగ్​ ఉంది.​ 'అఖండ' సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా తెలుగు చిత్రపరిశ్రమకు వెలుగునివ్వాలని ఆశిస్తున్నా. బోయపాటి శ్రీను గారంటే చాలా ఇష్టం. 'భద్ర' సినిమా నేను చేయాల్సింది. కానీ ‘ఆర్య’ ఉండటం వల్ల అది కుదరలేదు. బోయపాటి కెరీర్​ చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. నన్ను ఇష్టపడే వ్యక్తుల్లో ఆయనొకరు. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ట్రైలర్​ చూస్తుంటే అర్థమైపోయింది.. సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అని. ప్రగ్యా జైస్వాల్​కు ఈ సినిమా కెరీర్​లో మరింత ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. శ్రీకాంత్​ నాకు అన్నయ్యలాంటివారు. ఇక నుంచి మీరు కొత్త శ్రీకాంత్​ను చూస్తారు. తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాను ప్రేమించినంతగా.. ప్రపంచంలో ఏ ప్రేక్షకులు కూడా ఏ సినిమాను తెలుగు వారిలాగా ప్రేమించలేరు. జై బాలయ్య” అని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు.


ఈ చిత్రంలో బాలయ్య అఘోరాగా విభిన్న పాత్రలో కనిపించనున్నారు. ప్రగ్యా హీరోయిన్​గా చేసింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించారు. మిర్యాల రవీందర్​రెడ్డి నిర్మించారు.


Also Read: SS Rajamouli in Akhanda Event : బాలయ్య ఒక ఆటంబాంబు: రాజమౌళి


Also Read: Sirivennela Sitarama Sastry: ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి తీవ్ర అస్వస్థత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook