Pushpa 2-Allu Arjun: అనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'బేబీ'. యూత్ పుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వారం రోజులు అయినా సరే కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడం లేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలుగొడుతుంది. రూ.50 కోట్ల మార్కు దిశగా దూసుకెళ్తోంది. ఇందులో వైష్ణవి, అనంద్, విరాజ్ నటన అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. ఈ మూవీపై అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రష్మిక, మారుతీ వంటి సినీ ప్రముఖులు ప్రశంసలు వర్షం కురిపించారు. గురువారం బేబీ మూవీ టీమ్ అప్రిసియేషన్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ హాజరయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా బేబీ మూవీ యూనిట్ ను అభినందించారు. ముఖ్యంగా దర్శకుడు సాయిరాజేష్, హీరోహీరోయిన్లు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలను పొగడ్తలతో ముంచెత్తారు. ఫ్యాన్స్ కోరిక మేరకు పుష్ప2 సినిమాలోని డైలాగ్ ను చెప్పి అలరించాడు బన్నీ. ‘'ఈడంతా జరిగేది ఒక్కటే రూల్ మీద జరుగుతండాది.. పుష్ప గాడి రూల్’' అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. పుష్ప పార్ట్ 1లో‘తగ్గేదెలే’, ’పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా’ వంటి డైలాగ్స్ వరల్డ్ వైడ్ గా ఎంత ఫేమస్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. 



ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రీసెంట్ గా కొన్ని కీలక షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. ఈ సినిమాతోనే రష్మిక మందన్న నేషనల్ క్రష్ గా మారింది. ఈ చిత్రంలో  ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 


Also Read: Samajavaragamana OTT: 'సామజవరగమన' ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook