Allu Sneha Reddy Instagram Status: సినిమా అభిమానులకు తమ ఫేవరెట్ హీరోతో సమానంగా వారి ఫ్యామిలీపైన కూడా మక్కువ ఎక్కువే ఉంటుంది. అందుకే ఎవరైనా హీరోని ఇష్టపడితే వారి ఫ్యామిలీ గురించి కూడా తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు సినీ ప్రేక్షకులు. ఇక హీరో ఫ్యామిలీ మెంబర్స్ కి సంబందించిన సోషల్ మీడియా అకౌంట్‌లని వెతికి మరీ వాళ్ళని ఫాలో అయిపోతూ ఉంటారు. కాగా సోషల్ మీడియా లో విపరీతమైన అభిమానులను సంపాదించుకున్న వారిలో అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి కూడా ఒకరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లు స్నేహారెడ్డి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయి లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోగా అల్లు స్నేహా రెడ్డి కూడా అతని విజయాల వెనుక ఉంటూ అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టులకు చాలా మంది అభిమానులు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ స్నేహా రెడ్డి సొంతం. నిత్యం సోషల్ మీడియా వేదికగా చాలా స్టైలిష్ లుక్‌లో ఫోటోలను షేర్ చేయడమే కాకుండా తన తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది స్నేహ. అల్లు అర్జున్ గురించి అలానే తన పిల్లలు అర్హ, అయాన్‌ల గురించి అప్డేట్లను అభిమానులకు అందిస్తుంటుంది.


తాజాగా స్నేహ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో ఒక కొటేషన్ ఉన్న కార్డుని షేర్ చేసింది. ఇంతకీ ఆ కార్డు పైన ఉన్న కొటేషన్ ఏమిటి అంటే..' ప్రేమలో ఉన్నా.. లేకపోయినా కూడా నేను శాంపైన్ తాగుతాను' అని ఉంది. ఇక ఇలా పోస్ట్ పెట్టి తాను కూడా ఎలాంటి సమయంలో అయినా షాంపైన్ తాగుతానని తన అభిమానులకు చెప్పకనే చెప్పేసింది. ఇక ఇలాంటి ఒక పోస్ట్ స్నేహారెడ్డి తన స్టేటస్‌లో పెట్టడంతో.. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది.


Also Read: Assembly Elections 2023: ఎన్నికల కోడ్ అంటే ఏమిటి..? రూల్స్ ఎలా ఉంటాయి..? పూర్తి వివరాలు ఇవే..   


Also Read: Chandrabau Case: చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంలో విచారణ శుక్రవారానికి వాయిదా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి