DHEE 13 Grand Finale : ఢీ-13 గ్రాండ్ ఫినాలేలో బన్నీ పంచుల వర్షం..లేటేస్ట్ ప్రోమో అదిరిపోయింది
DHEE 13 Kings vs Queens Grand Finale : ఢీ-13 గ్రాండ్ ఫినాలేకు హాజరైన ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్.. చివరకు విజేతను ప్రకటించి ఢీ-13 టైటిల్ అందించారు. ఇక ఇందుకు సంబంధించిన లేటేస్ట్ ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. కంటెస్టెంట్స్ డ్యాన్స్‌లకు జడ్జీలు కూడా ఈలలు వేసి ఎంకరేజ్ చేశారు.
Icon Star AlluArjun to grace Dhee 13 Kings vs Queens Grand Finale, watch Latest Promo: డ్యాన్స్ షో ఢీ-13 గ్రాండ్ ఫినాలేకు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (AlluArjun) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కింగ్స్ వర్సెస్ క్వీన్స్‌గా సాగుతోన్న ఈ షోలో గ్రాండ్ ఫినాలే పోరును బన్నీ వీక్షించారు. చివరకు విజేతను ప్రకటించి ఢీ-13 ( Dhee 13 ) టైటిల్ అందించారు. ఇక ఇందుకు సంబంధించిన లేటేస్ట్ ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. కంటెస్టెంట్స్ డ్యాన్స్‌లకు జడ్జీలు కూడా ఈలలు వేసి ఎంకరేజ్ చేశారు. కంటెస్టెంట్స్ డ్యాన్స్‌లు చూసి బన్నీ కూడా ఆశ్చర్యపోయారు.
ఇక బన్నీ ఎంట్రీ టైమ్‌లో స్టేజ్ మొత్తం మారుమోగిపోయింది. పుష్ప మూవీలోని ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా అనే పాటతో ఐకాన్ స్టార్ ఎంట్రీ ఇచ్చారు. ఆర్య-2 టైమ్‌లో జరిగిన ఢీ -3 గ్రాండ్ ఫినాలేకు (Dhee 13 Grand Finale) అల్లుఅర్జున్ సుకుమార్ విచ్చేశారు. ఇక పదేళ్లు.. పది సీజన్ల తర్వాత ఐకాన్ స్టార్ (Icon Star AlluArjun) మళ్లీ ఈ సీజన్‌కు గెస్ట్‌గా రావడం ఆనందంగా ఉందంటూ ఫ్యాస్ అంటున్నారు. ఇక ఈ షోకు జడ్జిలుగా వ్యవహరిస్తున్న.. ప్రియమణి (priyamani), గణేశ్ మాస్టర్, పూర్ణలపై కూడా బన్నీ పంచుల వర్షం కురిపించారు.
Also Read : Corona cases in India: దేశంలో మళ్లీ లక్షకు చేరువలో యాక్టివ్ కరోనా కేసులు
తాను అల్లు అర్జున్‌తో (Allu Arjun) పని చేయలేకపోయాను అంటూ ప్రియమణి చెప్పగా.. "పని చేయలేదని అనుకోకండి.. మీరు ఇప్పుడు బాగా వెయిట్ తగ్గారు.. చాలా హాట్‌గా కూడా ఉన్నారు.. కాబట్టి ఛాన్స్ ఉంది" అంటూ అల్లు అర్జున్ కామెంట్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే ఫ్యూచర్‌లో అల్లు అర్జున్ మూవీలో (Allu Arjun Movie) ప్రియమణి పని చేసే అవకాశం ఉన్నట్లే అనిపిస్తోంది. ఇక చివరకు తగ్గేదేలే అనే డైలాగ్‌తో బన్నీ ఆకట్టుకున్నారు.
ఇక ఈ షోకు సుధీర్, హైపర్ ఆది, రష్మి, దీపిక టీమ్ లీడర్లుగా.. ప్రదీప్ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎంతో హోరాహోరీగా సాగుతోన్న ఢీ-13 గ్రాండ్ ఫినాలేలో (Dhee 13 Kings vs Queens Grand Finale) ఎవరు విజయం సాధించారు.. బన్నీ చేతుల మీదుగా టైటిల్ ఎవరు తీసుకున్నారనే విషయం డిసెంబర్ 8న తెలియనుంది.
Also Read : Gita Gopinath: గీతా గోపీనాథ్‌కు ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీగా ప్రమోషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook