IFFM 2023 Awards: ఉత్తమ చిత్రంగా ‘`సీతారామం`’.. కార్తిక్ ఆర్యన్ కు `గ్లోబల్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా` అవార్డు
IFFM 2023 Awards: తెలుగు సినిమా ఖ్యాతి రోజురోజూకు పెరుగుతుంది. మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన `సీతారామం` సినిమా మరో ఘనత సాధించింది. IFFM అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది.
IFFM 2023 full winners list: తెలుగు క్లాసిక్ 'సీతారామం'(Sita Ramam)కు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ‘'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్'’ (Indian Film Festival of Melbourne) బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ లో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ప్రేమ కథా చిత్రమే ‘'సీతారామం’'. గతేడాది రిలీజైన ఈ మధుర ప్రేమ కావ్యం ప్రతి ఒక్కరి హృదయాన్ని గెలుచుకుంది.
మెల్‌బోర్న్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలు ఆగస్టు 20 వరకు జరగనున్నాయి. తొలి రోజైన శుక్రవారం పలు క్యాటగిరీలకు సంబంధించిన అవార్డులను ఐఎఫ్ఎఫ్ఎమ్(IFFM) టీమ్ ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్, నటి మృణాల్ ఠాకూర్, నటుడు విజయ్ వర్మ, నిర్మాత కరణ్ జోహార్ ప్రారంభించారు. సినీ నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కరణ్ జోహార్‌ను ప్రత్యేకంగా సత్కరించారు.
విన్నర్స్ లిస్ట్:
జ్యూరీ అవార్డులు
ఉత్తమ డాక్యుమెంటరీ - టు కిల్ ఎ టైగర్
ఉత్తమ ఇండీ చిత్రం - ఆగ్రా
ఉత్తమ నటుడు - మోహిత్ అగర్వాల్(ఆగ్రా)
ఉత్తమ నటి - రాణి ముఖర్జీ(మిసెస్ ఛటర్జీ Vs నార్వే)
ఉత్తమ దర్శకుడు - పృథ్వీ కోననూర్ - హదినెలెంటు (సెవెన్టీనర్స్)
ఉత్తమ చిత్రం - సీతారామం
వెబ్ సిరీస్ కేటగిరి:
ఉత్తమ సిరీస్ - జూబ్లీ
ఉత్తమ నటుడు- విజయ్ వర్మ(దహాద్)
ఉత్తమ నటి- రాజశ్రీ దేశ్‌పాండే(ట్రయల్ బై ఫైర్)
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ - పీపుల్స్ ఛాయిస్ - కనెక్షన్ క్యా హై
బెస్ట్ షార్ట్ ఫిల్మ్ - ఆస్ట్రేలియా - హోమ్ బై మార్క్ రస్సెల్ బెర్నార్డ్
Also read: Chandramukhi 2 First Single: ‘చంద్రముఖి-2’ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
గౌరవ పురస్కారాలు:
ఈక్వాలిటీ ఇన్ సినిమా అవార్డు - డార్లింగ్స్
పీపుల్స్ ఛాయిస్ అవార్డు - పఠాన్
గ్లోబల్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా - కార్తిక్ ఆర్యన్
డైవర్సిటీ ఇన్ సినిమా అవార్డు - మృణాల్ ఠాకూర్
డిస్‌రప్టర్ అవార్డు - భూమి పెడ్నేకర్
రెయిన్‌బో స్టోరీస్ అవార్డు - పైన్ కోన్‌కి ఓనిర్
Also read: Jailer Collections: జైలర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. కుమ్మేసిన తలైవా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి