IIFA Awards 2024: ఘనంగా ఐఫా అవార్డుల ప్రధానోత్సవం.. ఉత్తమ నటుడిగా షారుఖ్.. సత్తా చాటిన యానిమల్..
IIFA Awards 2024: దుబాయి వేదికగా అబుధాబిలో జరగుతున్న ఐఫా అవార్డుల్లో కార్యక్రమం అట్టహాసంగా జరగుతుంది. ఇందులో భాగంగా ముందు రోజు సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు అవార్డులను అందజేసారు. రెండో రోజు బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన అవార్డులను అందజేసారు. ఇందులో ఉత్తమ నటీనటులుగా షారుఖ్, రాణీ ముఖర్జీ నిలిచారు. యానిమల్ మూవీ పలు విభాగాల్లో సత్తా చాటింది.
IIFA Awards 2024: అబుధాబీలో జరగుతున్న ఐఫా అవార్డుల ప్రధానోత్సవం ఎంతో అట్టహాసంగా జరగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు నుంచి చిరంజీవికి లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డుతో సత్కరిస్తే.. బాలయ్యను గోల్టెన్ లెగసీ అవార్డుతో గౌరవించింది. తెలుగు సినిమాకు సంబందఙంచి నాని ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. నిన్న బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన అవార్డులను అనౌన్స్ చేశారు. ఇందులో 2023లో విడుదల చిత్రాలకు గాను అవార్డుల ప్రధానం చేసారు. గతేడాది విడుదలైన 'జవాన్' సినిమాలోని నటనకు గాను షారుఖ్ ఖాన్ బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. 'మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే' సినిమాలోని నటనకు గాను రాణీ ముఖర్జీ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకుంది. తన బిడ్డల కోసం నార్వే ప్రభుత్వంతో పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాణి నటనకు మంచి మార్కులే పడ్డాయి.
కృషి, పట్టుదల, దీక్ష ఉంటే ఏదైనా సాధించవచ్చనే ఇతివృత్తంతో తెరకెక్కిన రియలిస్టిక్ మూవీ 'ట్వెల్త్ ఫెయిల్' దర్శకుడు విధు వినోద్ చోప్రా కు బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు. ఇక తెలుగు వాడైన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'యానిమల్' మూవీ బెస్ట్ మూవీగా అవార్డు కైవసం చేసుకుంది.
యానిమల్ సినిమాలోని నటనకు గాను అనిల్ కపూర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. 'రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని లోని సినిమాలోని నటనకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ విభాగంలో షబానా అజ్మీ అవార్డు కైవసం చేసుకున్నారు. 'యానిమల్' సినిమాలోని నటనకు గాను బాబీ దేవోల్ బెస్ట్ విలన్ గా అవార్డు వరించింది. మ్యూజిక్ డైరెక్షన్ విభాగంగాలో యానిమల్ సినిమాకు సంగీతం అందించిన ప్రీతమ్, విశాల్ మిశ్రా, మనన్ భరద్వాజ్, శ్రేయస్ పురాణిక్, జానీ, భూపేందర్ బబ్బల్, ఆషిమ్ కేమ్సన్, హర్షవర్ధన్ రామేశ్వర్ సంయుక్తంగా ఈ అవార్డు అందుకున్నారు.
యానిమల్ సినిమాలోని పాట పాటిన అర్జన్ వైలీ.. బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ గా అవార్డు అందుకున్నారు. బెస్ట్ ఫీమేల్ ప్లే సింగర్ విభాగంలో జవాన్ సినిమాలో 'చాలెయా' పాటను ఆలపించి శిల్పారావుకు దక్కింది.
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.