Jai Jawan Movie Trailer: సంతోష్‌ కల్వచెర్ల హీరోగా నాగబాబు పోటు దర్శకత్వంలో రూపొందుతోంది ఇండిపెండెట్‌ ఫిల్మ్‌ 'జై జవాన్‌'. పావని రామిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. తనికెళ్ల భరణి, సత్యప్రకాష్‌, నాగినీడు, విజయ రంగరాజు, అప్పాజీ అంబరీష్‌, బీహెచ్‌ఈఎల్‌ ప్రసాద్‌, బలగం సంజయ్‌, బాల పరసార్‌, సంజన చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కేఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై సందిరెడ్డి శ్రీనివాసరావు, పోసం మధుసూదన్‌ రెడ్డి, పోటు వెంకటేశ్వర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో దేశ సరిహద్దుకు రక్షణగా నిలుస్తున్న సైనికుడి గొప్పదనాన్ని తెలియజేసే  కథాంశంతో తెరకెక్కించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tirumala: తిరుపతి వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. నవంబర్‌ మాసం రూ. 300 దర్శనం టిక్కెట్ల షెడ్యూల్‌ విడుదల..  


ఈ మూవీ ట్రైలర్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  ప్రముఖ దర్శకుడు గోపీచంద్‌ మలినేని రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ మూవీ కాన్సెప్ట్‌ తనకు నచ్చిందని చెప్పారు. ట్రైలర్‌ చూస్తుంటే దేశభక్తి నేపథ్యంలో రూపొందిన గొప్ప చిత్రంలా ఉండబోతుందని అర్థమవుతోందన్నారు. ఇలాంటి ఇండిపెండెట్‌ ఫిల్మ్‌ విజయం సాధించాలని ఆకాక్షించారు. ఈ సినిమా ద్వారా టీమ్‌ అందరికి మంచి పేరును తీసుకురావాలని కోరుకున్నారు. అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ.. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో సైనికుడి గొప్పతనం గురించి తెలియజేశామని చెప్పారు. హీరోగా సంతోష్‌ కల్వచెర్ల చక్కగా యాక్ట్ చేశాడని.. ఆయనకు హీరోగా మంచి భవిష్యత్‌ ఉందన్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించి.. విషెస్‌ అందజేసిన గోపీచంద్‌ మలినేనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.


ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా.. సైనికుడు ఈ దేశం కోసం తమ జీవితాలను ఎలా త్యాగం చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు చూపించారు.'ప్రాణం తీసే ఆయుధాలంటే భయం లేదు నాకు.. చావు కోరే శత్రువులంటే కోపం రాదు' అంటూ తనికెళ్ల భరణి  చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. 'జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణాన్ని.. జీవితానిచ్చిన మాతృభూమి రుణాన్ని తీర్చుకునేది ఒక జవాన్‌ మాత్రమే' అంటూ సాయికుమార్‌ చెప్పిన డైలాగులు ప్రేక్షకులకు గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉన్నాయి. ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్‌ మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.


==> రైటింగ్-డైరెక్టర్: నాగబాబు పోటు
==> ప్రొడ్యూసర్స్: సందిరెడ్డి శ్రీనివాసరావు, పోసం మధుసూదన్‌ రెడ్డి, పోటు వెంకటేశ్వర్లు
==> సమర్పణ: ఈశ్వరీ కుమార
==> DOP: బాబు కొలబతుల
==> ఎడిటర్‌: బోయ బాలకృష్ణ, సంగీతం: రాజేష్‌  
==> సౌండ్‌ డిజైన్‌: జి.పురుషోత్తమ రాజు
==> ఆర్ట్‌: రవిబాబు దొండపాటి 
==> పబ్లిసిటి డిజైనర్‌: సుధీర్‌
==> PRO: సాయి సతీష్‌


Also Read: Happy Independence Day 2024: పంద్రాగస్టున అందరినీ ఇలా విష్ చేయండి, టాప్ 10 విషెస్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.