Indian 2 Story Leak: లోకనాయకుడు కమల్ హాసన్.. స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా విడుదలై దాదాపు రెండు దశాబ్దాల తర్వాత.. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 తెరకెక్కనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అసలే బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ కాబట్టి ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.


ప్రముఖ సౌత్ నటుడు సిద్ధార్థ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కథ కొంచెం.. ఇంటర్నెట్ లో లీక్ అయింది. అందులో ముఖ్యంగా సిద్ధార్థ పాత్ర గురించి నాకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. 


సేనాపతి (కమల్ హాసన్) విదేశాల్లో ఉన్నప్పుడు భారతదేశంలో అవినీతి రాజకీయాల పట్ల ఒక యువకుడు పోరాటం చేస్తున్నాడని తెలుసుకుంటాడు. అతని ప్రాణాలకి హాని ఉంది అని తెలుసుకున్న సేనాపతి..అతనిని రక్షించడానికి తిరిగి భారతదేశానికి వస్తాడు. ఆ కుర్రాడు పాత్రలో సిద్ధార్థ నటిస్తున్నారట. 


మరి ఈ కథను శంకర్ ఏ విధంగా తరాకెక్కిస్తున్నారో చూడాలి. సిద్ధార్థ పాత్రకి జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఉండే డ్యూయెట్ సాంగ్ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ గా త్వరలో విడుదల చేయనున్నారు. చూస్తూ ఉంటే సిద్ధార్థ కి ఈ సినిమాలో మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికినట్లే అనిపిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే మాత్రం.. సిద్ధార్థ్ కోరుకున్నట్లు తెలుగు నుంచి కూడా మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకి కూడా సీక్వెల్ గా ఇండియన్ 3 ఉండబోతోంది కాబట్టి.. అందులో కూడా సిద్ధార్థకి ఒక కీలక పాత్ర ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. 


కాగా భారీ అంచనాల మధ్య ఈ సినిమా జులై 12న థియేటర్లలో విడుదలకి సిద్ధం అవుతోంది. 
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహ, సముతిరఖని, ఎస్ జె సూర్య, ప్రియా భవాని శంకర్ లతో పాటు బ్రహ్మానందం కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు, రెడ్ జైంట్ మూవీస్ వారితో సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవి చందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.


ఇండియన్ 2 సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో, శంకర్ కేవలం ఈ సినిమా మీదనే ఫోకస్ చేస్తున్నారు. దీంతో రామ్ చరణ్ అభిమానులు కూడా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా విడుదల అయ్యాకే.. శంకర్ మల్లి గేమ్ చేంజర్ సినిమా మీద దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. మరి శంకర్ ఎంత త్వరగా రామ్ చరణ్ సినిమాని పూర్తి చేస్తారో వేచి చూడాలి. 
­


Also read: IT Warning: ట్యాక్స్ పేయర్లు మే 31లోగా ఆ పని చేయకుంటే రెట్టింపు టీడీఎస్ కట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook