Laggam Trailer Launch: చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా.. ఓపెనింగ్ కలెక్షన్లు బాగుండాలి అంటే సినిమా ప్రమోషన్స్ కూడా భారీగానే ఉండాలి. ఈ నేపథ్యంలోనే త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లగ్గం చిత్ర బృందం కూడా.. వినూత్నమైన ప్రమోషన్లను మొదలుపెట్టింది. సినిమాలో ప్రేక్షకులకు పరిచయం చేయడానికి.. చిత్ర బృందం చాలానే కష్టపడుతుందని చెప్పుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మామూలుగా ఏదైనా చిన్న సినిమా విడుదల అవుతుంది అంటే.. ఏదైనా పెద్ద ప్రొడ్యూసర్ లేదా ఒక పెద్ద హీరోతో సినిమాకి సంబంధించిన టీజర్ లేదా ట్రైలర్ లాంచ్ చేయించడం లాంటిది చేస్తూ ఉంటారు. కానీ ఇలా కాకుండా లగ్గం సినిమా బృందం సరికొత్త విధానాలతో ప్రమోషన్లు మొదలుపెట్టింది. 


సినిమా పాటలు, పోస్టర్లు, టీజర్ అంటూ రోజు ప్రేక్షకులను పలకరిస్తూ "రీల్ పెట్టు - చీరపట్టు" అంటూ డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఒక వైపు లగ్గం ట్రావెలర్ అంటూ ఊరూరా తిరుగుతూ గిఫ్ట్స్ అందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం మరో కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది చిత్ర బృందం. 


లగ్గం సినిమా ట్రైలర్ ని నిజంగా లగ్గం (పెళ్లి) చేసుకుంటున్న నూతన వధూవరులతో లాంచ్ చేయించారు. ఇంజాపూర్ లో SPR శ్రీరస్తు కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఒక వివాహ వేడుకలో లగ్గం బృందం కూడా వచ్చి.. నూతన వధూవరులు గోవర్ధన్, అనూషలు మండపంలో ఉన్నపుడే.. వారి చేత లగ్గం సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసింది చిత్ర యూనిట్. 


ఈ నేపథ్యంలో లాగ్గానికి వచ్చిన అందరూ షాక్ అయ్యారు. వధూవరుల కూడా ఇది జీవితాంతం మాకు గుర్తుండి పోయే లగ్గం అని భావోద్వేగానికి లోనయ్యారు. సినిమా దర్శకుడు రమేష్ చెప్పాల, చిత్ర నిర్మాత సుభిషి ఎంటర్టైనమెంట్స్ అధినేత వేణుగోపాల్ రెడ్డి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. 


సాయి రోనక్, ప్రజ్ఞ నగ్ర హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగుణ ,లక్ష్మణ్ మీసాల, ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. 


 



Also Read: Money Scheme For Women: మోదీ ప్రభుత్వం అందిస్తున్న రూ. 2 లక్షలు కావాలా..అయితే ఇలా అప్లై చేసుకుంటే వెంటనే లభించడం ఖాయం..  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి