గత కొంతకాలంగా సినీనటుడు పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన శ్లామ్ బుక్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో తన అభిమాన నటుల వివరాలతో పాటు తన  ఇష్ట, అయిష్టాలను కూడా తన అభిమానులతో ఆయన పంచుకున్నారు. అందులో పలు ఆసక్తికరమైన విషయాలు ఇవి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అభిమాన నటులు - ఎస్ వి రంగారావు, అమితాబ్ బచ్చన్ తన అభిమాన నటులని పవన్ తన శ్లామ్‌లో రాసుకోగా... కొన్ని వెబ్‌సైట్లలో అల్ పాసినో, రాబర్డ్ డీ నిరో వంటి విదేశీ నటులంటే కూడా తనకు అభిమానమని పవన్ అన్నట్లు తెలుస్తోంది. అలాగే సావిత్రిని  తన అభిమాన నటిగా కూడా పవన్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా తనకు మైఖేల్ జాక్సన్ సంగీతమంటే ఇష్టమని కూడా ఆయన అన్నట్లు సమాచారం. ఇక హాస్యనటుల విషయానికి వస్తే రేలంగి, సూర్యకాంతం కామెడీ తనకు ఇష్టమని పవన్ తెలిపినట్లు కొన్ని పత్రికలు రాశాయి. అలాగే తన అభిమాన డైరెక్టర్ విదేశీ దర్శకుడు అకీరా కురసోవా అని పవనే కొన్నిసార్లు చెప్పిన విషయం మనకు తెలిసిందే. అలాగే మణిరత్నం సినిమాలన్నా, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అన్నా తనకు ఇష్టమని పవన్ పేర్కొన్నట్లు పలు పత్రికలు రాశాయి. 


అభిమాన రచయితలు - అలాగే పవన్ తన అభిమాన పుస్తకాల్లో "సిద్దార్థ" ఒకటని తెలిపినట్లు కూడా తెలుస్తోంది. 1922లో హెర్మన్ హెస్సే రాసిన బుద్ధుని జీవిత చరిత్రే అదని కొందరంటారు. కొన్ని పత్రికల్లో.. అలాగే వెబ్ సైట్లలో మాత్రం రాబర్ట్ స్కబోడా రాసిన అఘోరా, మైఖేల్ మార్పుగో రాసిన షాడో, శివాజీ సావంత్ రాసిన యుగంధర్ కూడా పవన్ అభిమాన పుస్తకాలు అని చెప్పడం జరిగింది. అయితే తెలుగు రచయితల్లో గుంటూరు శేషేంద్రశర్మ అంటే పవన్‌కు ఎంత అభిమానమో ఆయనే స్వయంగా ఓసారి వేదికపై చెప్పారు. ఆయన కవిత్వాన్ని కూడా పవన్ జనసేన మీటింగుల్లో చదివారు. గత సంవత్సరం శేషేంద్ర రాసిన "ఆధునిక మహాభారతం" కొత్త ఎడిషన్ బయటకు రావడానికి పవన్ కళ్యాణే ఆర్థిక సహాయం చేశారు. 


అభిమాన సినిమాలు - పవన్ కళ్యాణ్ తన అభిమాన సినిమాలు గుండమ్మ కథ, మిస్సమ్మ అని శ్లామ్‌లో చెప్పగా.. చిరంజీవి నటించిన ఖైదీ చిత్రం కూడా ఆయన ఆల్ టైమ్ ఫేవరేట్ అని కొన్ని సైట్లు రాశాయి. అలాగే పవన్ అభిమాన నాయకుడు చేగువేరా అన్నది మనందరికీ తెలిసిన విషయమే