IPL మూవీ ఎలా ఉందంటే?.. కథ, కథనాలివే
IPL Its Pure Love Telugu Movie Review ఐపీఎల్ ఇట్స్ ప్యూర్ లవ్ అనే సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. ఇందులో ఆట మీద ప్రేమ, దేశం మీద ప్రేమ ఇలా అన్నింటిని చూపించారు. ఇక యూత్‌కు నచ్చే అన్ని అంశాలను ఇందులో పొందుపరిచారు.
IPL Its Pure Love Telugu Movie Review అసలే ఇప్పుడు మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా అన్ని సినిమాలు ఆడేస్తున్నాయి. ఇందులో భాగంగా కొత్త రకం కాన్సెప్టులు వస్తుంటే మరింతగా జనాలు ఆదరిస్తున్నారు. ఇది వరకు స్పోర్ట్స్ డ్రామాలెన్నో మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు క్రికెట్ ఆటకు, టెర్రరిజానికి లింక్ చేసి ఐపీఎల్ ఇట్స్ ప్యూర్ లవ్ అనే సినిమాను తీశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
ఐపీఎల్ కథ క్రికెట్, టెర్రరిజం, ప్రేమ చుట్టూ తిరుగుతుంది. ఐపీఎల్ ఆటలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఇండియాను కిందకు దించి పాకిస్థాన్‌ను ప్రథమ స్థానంలోకి తీసుకొచ్చేందుకు టెర్రరిస్ట్‌లు పథకాలు రచిస్తుంటారు. ఇందుకోసం వైజాగ్‌లోకి టెర్రరిస్ట్ ఇమ్రాన్ తమ్ముడు సలీం ఎంట్రీ ఇస్తాడు. మరో వైపు శ్రీరామ్ (నితిన్), వరుణ్ (విశ్వ కార్తికేయ)ల కథలు నడుస్తుంటాయి. శ్రీరామ్ అమ్ము, వరుణ్ జాన్వీ ప్రేమ కథలకు, ఈ ఐపీఎల్ మ్యాచ్‌లకు ఉన్న సంబంధం ఏంటి? టెర్రరిస్టులు వేసిన ప్లాన్‌ను అడ్డుకోవడానికి, ఐపీఎల్ గందరోగోళం కాకుండా ఉండేందుకు వరుణ్, శ్రీరామ్‌లు చేసిన పనులు ఏంటి? చివరకు వీరి జీవితాలు ఎలా మలుపు తిరిగాయన్నది థియేటర్లో చూడాల్సిందే.
నటీనటులు
క్రికెటర్‌గా శ్రీరామ్ పాత్రలో నితిన్ మెప్పిస్తాయి. లవ్ సీన్స్‌లో వరుణ్, శ్రీరామ్ కారెక్టర్‌లు అందరినీ మెప్పిస్తాయి. ఇక యాక్షన్ సీక్వెన్స్‌లో అయితే ఇద్దరు హీరోలు అదరగొట్టేశారు. అయితే డైలాగ్ డెలివరీ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెట్టాల్సిందేమోననిపిస్తుంది. హీరోయిన్లు అయితే అందంగా కనిపించారు. విలన్లుగా నటించిన వారు పర్వాలేదనిపిస్తాయి. పోసాని నవ్విస్తాడు. సుమన్, తణికెళ్ల భరణి వంటి వారు తమ అనుభవాన్ని ప్రదర్శించారు. రచ్చ రవి, కుమార్ సాయి వంటి వారు నవ్విస్తారు. మిగిలిన పాత్రలన్నీ తమ పరిధి మేరకు మెప్పిస్తాయి.
విశ్లేషణ
ఏ సినిమాకైనా కథ, కథనాలు ముఖ్యంగా ఉంటాయి. పాత కథను కొత్తగా చూపించినా జనాలు ఆదరిస్తుంటారు. ఇక కొత్త కథను చెప్పే సమయంలోనే అన్ని రకాల ఎమోషన్స్‌ను జాగ్రత్తగా డీల్ చేయాల్సి వస్తుంది. కామెడీ, లవ్, ఎమోషన్ ఇలా ప్రతీ ఒక్కటీ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐపీఎల్ కథలో క్రికెట్‌ను, టెర్రరిజాన్ని, లవ్వుని కలగలపి చూపించారు. కామెడీని పండించే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆ ప్రయత్నం పూర్తిగా సఫలమైనట్టుగా అనిపించదు.
ప్రథమార్థం అంతా కాస్త నీరసంగా సాగినట్టు అనిపిస్తుంది. అసలు కథ సెకండాఫ్‌లోనే ఉంటుంది. టెర్రరిస్టులు ఐపీఎల్ మ్యాచులను చేజక్కించుకుందామని అనుకోవడం, దాన్ని మన హీరోలు తిప్పికొట్టడం వంటి సీన్లు ఊహకు అందుతూనే సాగుతాయి. క్లైమాక్స్ ప్రేక్షకుడు ఊహకు తగ్గట్టుగానే సాగుతుంది.
సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది. పాటలు, మాటలు మెప్పిస్తాయి. క్రికెట్ ఆట గురించి చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. కొన్ని అనవసరమైన సీన్లు, నవ్విస్తాయని అనుకున్న సీన్లు తేడా కొట్టేశాయి. వాటిని లేపేయాల్సింది. విజువల్స్ బాగున్నాయి. నిర్మాత పెట్టిన ఖర్చు ప్రతీ ఫ్రేములో కనిపిస్తోంది.
రేటింగ్ 2.5
Also Read: Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే
Also Read: SSMB 28 Look : మహేష్ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి