Balakrishna Ignores Jr NTR : తారకరత్న పెద్దకర్మ విజువల్స్.. ఎన్టీఆర్‌ను పట్టించుకోని బాలయ్య.. ఫ్యాన్స్ ఎమోషనల్
Balakrishna Ignores Jr NTR బాలయ్య నందమూరి ఫ్యామిలీలో అందరితో బాగానే ఉంటాడు. కానీ ఎన్టీఆర్ విషయానికి వచ్చే సరికి వింతగా ప్రవర్తిస్తుంటాడు. ఎవరో తెలియదు అన్నట్టుగా చేస్తుంటాడు. బాలయ్య ఎన్నో సార్లు ఎన్టీఆర్ పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు.
Balakrishna Ignores Jr NTR నందమూరి అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో రెండుగా చీలినట్టు కనిపిస్తోంది. మామూలుగానే లోలోపల ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త దూరంగానే ఉంటారు. కానీ నందమూరి ఫ్యాన్స్ అనే సరికి అంతా కలిసి పోతారు. అయితే బాలయ్య మాత్రం ఎన్టీఆర్‌ను ఎప్పుడూ దూరం పెట్టడం, పరాయివాడిలా చూస్తుంటాడనే టాక్ బయటకు వచ్చింది. ఆ టాక్‌కు తగినట్టుగానే కొన్ని కొన్ని విజువల్స్ కూడా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు తారకరత్న పెద్ద కర్మలో ఎన్టీఆర్ బాలయ్య విజువల్స్ వైరల్ అవుతున్నాయి.
ఇన్ని రోజులు బయట వస్తున్న టాక్‌కు తగ్గట్టుగానే బాలయ్య ప్రవర్తించాడు. ఎన్టీఆర్‌ను పూచిక పుల్లలా తీసి పారేశాడు. కనీసం చూపు కూడా చూడలేదు. చేయి ఎత్తి పలకరించలేదు. ఎన్టీఆర్ అనేవాడు అక్కడ ఉన్నాడనేది కూడా బాలయ్య పట్టించుకున్నట్టుగా లేదు. కానీ తన బాబాయ్ పట్ల ఎన్టీఆర్ మాత్రం గౌరవాన్ని ప్రదర్శించాడు. బాలయ్య రావడంతోనే కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లేచి నిల్చున్నారు. కానీ బాలయ్య మాత్రం ఆ ఇద్దరినీ పట్టించుకోలేదు.
ఇక మరో సందర్భంలో కనీసం కళ్యాణ్ రామ్‌ని అయినా బాలయ్య రా అని సైగ చేశాడు. తారకరత్న చిత్రపటానికి నివాళి అర్పించమని సైగ చేశాడు. అయితే వెనకాలే ఉన్న ఎన్టీఆర్‌ను మాత్రం రమ్మని పిలవలేదు. ఎన్టీఆర్ వస్తాడని తెలిసే.. పక్కన ఉన్న వాళ్లతో ఏదో మాట్లాడుతూ అటూ ఇటూ చూస్తున్నాడు తప్పా.. ఎన్టీఆర్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఎన్టీఆర్ ముందు వెనక ఉన్న వారితో మాట్లాడాడు. కానీ ఎన్టీఆర్‌ను మాత్రం చూడనైనా చూడలేదు.
ఈ విజువల్స్ చూసి ఎన్టీఆర్ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. అన్నకు బయట కష్టాలే ఇంట్లోనూ కష్టాలే అంటూ ఏడ్చేస్తున్నారు. మొదటి సారిగా బాలయ్య అంటే నచ్చడం లేదు అని నందమూరి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇలా బహిరంగంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్యను తిట్టేస్తున్నారు. ఎన్టీఆర్ పడుతున్న బాధను వర్ణించలేమని, ఇంతలా అవమానించాలా? ఎందుకు ఇంత కోపం అంటూ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.
ఎన్టీఆర్‌కు గత వారం రోజుల నుంచి గడ్డు కాలమే నడుస్తున్నట్టుగా ఉంది. ఆర్ఆర్ఆర్ విషయం, హెచ్‌సీఏ వేడుకలకు వెళ్లకపోవడం, అంతా రామ్ చరణ్ జపమే చేస్తుండటం.. ఇప్పుడు ఇంట్లో వాళ్లే ఇలా చేస్తుండటం.. ఎన్టీఆర్ బాధను వర్ణించలేం అంటూ నెటిజన్లు సైతం ఎమోషనల్ అవుతున్నారు.
Also Read: Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook