Is Charmee Kaur Not Able To Digest Karthikeya 2’s Success: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాకు ఏ మాత్రం మంచి స్పందన రాకపోవడం అలాగే కార్తికేయ 2 సినిమా సూపర్ హిట్ కావడం కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉందని లైగర్ నిర్మాతల్లో ఒకరైన చార్మి పేర్కొన్నారు. ఆమె అభిప్రాయం ప్రకారం ఇప్పుడు మేకర్స్ ప్రేక్షకులను థియేటర్ల దాకా రప్పించాలంటే ఎక్కువ పని చేయాలని చెప్పుకొచ్చారు.. తాజాగా ఒక నేషనల్ ఛానల్ తో మాట్లాడిన ఛార్మి  లైగర్ సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలీవుడ్ సినిమాలు ఫెయిలవడం వెనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలను ఆమె వెల్లడించారు. అదేమిటంటే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ఎక్కువ కష్టపడాలని ఓటీటీ కంటెంట్ విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత మేకర్స్ చాలా జాగ్రత్తగా సినిమాలు చేయాల్సి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రేక్షకులకు ఒక్క క్లిక్ లోనే ప్రపంచమంతా అందుబాటులో ఉందని ఎంత భారీ బడ్జెట్ సినిమాలైనా కుటుంబం అందరూ కలిసి థియేటర్లలో చూడటం కంటే టీవీలో చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు.


వాళ్ళని నిజంగా ఎక్సైట్ చేసే సినిమా ఏదైనా ఉంటే అప్పుడు థియేటర్లకు వస్తున్నారు కానీ లేకపోతే రావడం లేదని చెప్పుకొచ్చారు. బాలీవుడ్ ప్రేక్షకుల సంగతి అలా ఉంటే తెలుగులో మూడు సినిమాలు బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలు విడుదలై మూడూ కలిపి 170 కోట్ల మార్కెట్ చేశాయని అదే దేశంలో లైగర్ సినిమా పత్తా లేకుండా పోయిందని ఆమె చెప్పకొచ్చారు.  దక్షిణాది ప్రజలు సినిమాల మీద అంతగా ఆసక్తి చూపిస్తారని ఆమె పేర్కొన్నారు. అయితే లైగర్ నిరాశ పరచడానికి అనేక సార్లు వాయిదా పడటం కూడా కారణమై ఉండొచ్చని చార్మి అభిప్రాయపడ్డారు.


20లో టైగర్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభించామని కరోనా కారణంగా రెండేళ్ల పాటు షూటింగ్ జరిపిన తర్వాత 2022 ఆగస్టులో సినిమా బయటకు వచ్చిందని చెప్పుకొచ్చారు. కచ్చితంగా మేము థియేటర్లలోనే సినిమా రిలీజ్ చేయాలనుకున్నాము కానీ అప్పటికే మా తెలుగు సినీ పరిశ్రమ నుంచి సిద్ధంగా ఉన్న ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి సినిమాలు ముందు బయటకు రావడానికి మేము వెయిట్ చేశామని చెప్పుకొచ్చారు. అలా చాలా కష్టాలు పడ్డాము కానీ ఎప్పుడూ వెనకడుగు వేయలేదని ఆమె చెప్పుకొచ్చారు. అయితే లైగర్ లాంటి సినిమా పేలవమైన ప్రదర్శనలు చేస్తూ ఉండడం కార్తికేయ సినిమా ఇంత హిట్ కావడం కన్ఫ్యూషన్ కి గురి చేసిందని చార్మి పేర్కొనడం చూస్తుంటే ఆమె కార్తికేయ సక్సెస్ జీర్ణించుకోలేకపోతోందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. 


Also Read: Brahmastra Pre-Release Event: బ్రహ్మస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ వెనుక కేసీఆర్ సర్కారు ?


Also Read: Lakshmi Pranathi: ఎన్టీఆర్ భార్య చూశారా ఎంత అందంగా ఉందో?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి