చెన్నై: రాజకీయాల్లోకి తాను  వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే తమిళ నటుడు కమల్ హాసన్ ప్రకటించిన నేపథ్యంలో, అతని నిర్ణయం పట్ల అన్ని రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో పలు పార్టీలు కమల్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నాయి. కాగా చెన్నైలో కమల్ తో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సమావేశమవుతుండటం గమనార్హం. 


గురువారం మధ్యాహ్నం కమల్ హాసన్ ఇంటికి ఢిల్లీ సీఎం వెళ్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాలకే పరిమితం అయ్యింది. దక్షిణాదిన ఈ పార్టీ హవా ఏమీ లేదు. ఈ నేపథ్యంలో కమల్ ను  కేజ్రీవాల్ కేవలం స్నేహపూర్వకంగానే కలుస్తున్నారా.. లేదా రాజకీయ పరమైన ఇతరత్రా  కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.