Bandla Ganesh Bursts on Puri : బండ్ల బరస్ట్ అయ్యారా? అయ్యేలా చేశారా?.. వెనకున్నది ఆమేనా?
Bandla Ganesh Bursts on Puri : ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. బండ్ల గణేష్ పూరిని టార్గెట్ చేయడం వెనుక పూరి భార్య లావణ్య ప్రియమైన ఉందనే చర్చ జరుగుతోంది.
Bandla Ganesh Comments on Puri : పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. పూరి జగన్నాథ్ కెరీర్ మొదటి నుంచి మంచి పరిచయం ఉన్న వ్యక్తిగా పేరు ఉన్న బండ్ల గణేష్ పూరి జగన్నాథ్ ఈవెంట్ కి రాకపోవడంతో తనదైన శైలిలో ఒకపక్క ఆగ్రహం వ్యక్తం చేస్తూనే మరో పక్క బుజ్జగిస్తున్నట్లు మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. ర్యాంపులు వ్యాంపులు అంటూ ఆయన మాట్లాడిన మాటలు హీరోయిన్ ఛార్మి గురించే అన్న చర్చ ఇప్పటికే సోషల్ మీడియాలో మొదలైంది. అయితే ఇలా బండ్ల గణేష్ పూరిని టార్గెట్ చేయడం వెనుక పూరి భార్య లావణ్య ప్రియమైన ఉందనే చర్చ జరుగుతోంది.
ఎందుకంటే ఒక నిర్మాతగా బండ్ల గణేష్ కు పూరి లాంటి దర్శకుడి ఆశీర్వాదాలు కచ్చితంగా ఉండాలి. గతంలో టెంపర్ లాంటి అద్భుతమైన హిట్స్ ఇచ్చి తనను వొడ్డున పడేసిన పూరి జగన్నాథ్ మీద బండ్ల గణేష్ ఈ విధంగా మాట్లాడి ఉండకూడదు అనే వాదన తెరమీదకు వస్తోంది. అందుకే బండ్ల గణేష్ మాట్లాడుతున్నంత సేపు తన ప్రస్తావన వచ్చినప్పుడల్లా దండం పెడుతున్న పూరి భార్య లావణ్య ఈ స్పీచ్ కు కారణమా అనే చర్చ కూడా జరుగుతోంది. నిజానికి లావణ్య ఇప్పటిదాకా సినిమా ఫంక్షన్స్ లో కనిపించింది లేదు. అలాంటిది కుమారుడి సినిమాకు అన్నీ తానే వ్యవహరించినట్లు కుమారుడు పక్కనే కూర్చుని ఉండడం కూడా ఆసక్తికరంగా మారింది.
ఈ ఈవెంట్ కి పూరి జగన్నాథ్ రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఆమె కావాలనే బండ్ల గణేష్ తో ఇలా మాట్లాడించి ఉండవచ్చనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాలలో పెద్ద ఎత్తున జరుగుతోంది. బండ్ల గణేష్ మాట్లాడిన విషయంలో ఎక్కడా కూడా తప్పు లేదు కానీ గుట్టుగా మాట్లాడుకోవాల్సిన విషయాలను ఒక వేదిక మీద కోట్ల మంది తెలుగు ప్రేక్షకులకు చేరే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదని పూరి అభిమానులు వాపోతున్నారు. ఆకాష్ పూరి చివరి చిత్రం రొమాంటిక్ సినిమా విషయంలో పూరి జగన్నాథ్ అన్నీ తానే అయి నడిపించాడు.
సినిమాకు కథ ఇవ్వడం మొదలు ప్రమోషన్స్ కి ప్రభాస్ లాంటి స్టార్లను దింపడం వరకు పూరి జగన్నాథ్ చక్రం తిప్పాడు. తన క్రేజ్ మొత్తం వాడుతున్నా ఆకాష్ కి కలిసి రావడం లేదని ఈ సారి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని పూరి భావిస్తున్నాడని అంటున్నారు. మరికొందరు మాత్రం బండ్ల గణేష్ మాట్లాడిన మాటల్లో ఏమీ తప్పు లేదని సొంత కొడుకు రిలీజ్ ఈవెంట్ కి తండ్రి రాకపోతే ఆ బాధ ఎవరికైనా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి బండ్ల గణేష్ తన మనసులో మాటలను బయట పెట్టారు కానీ అవి నిజంగా ఆయన మనసులో మాటలేనా లేక పూరి భార్య లావణ్య మనసులో మాటలా అనే విషయం మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది.
Also Read:Kangana Ranaut Video Viral: మహారాష్ట్ర ప్రభుత్వ పతనాన్ని ముందే ఊహించిందా.. పాత వీడియో తెరమీదకు!
Also Read:Ram Pothineni Sorry To Lingusamy : అన్నీ చెప్పి అసలు విషయం మర్చిపోయా.. క్షమించమంటూ ట్వీట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook