Simbhu - Nidhi Agarwal: స్టార్ హీరోతో నిధి అగర్వాల్ సహజీవనం.. ఏకంగా అతని ఇంటికే మకాం మార్చిన ఇస్మార్ట్ బ్యూటీ!!
కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో అందాల నిధి అగర్వాల్ సహజీవనం చేస్తున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. చెన్నైలో ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారని రూమర్స్ వస్తున్నాయి.
Is Nidhhi Agerwal wants to marry Kollywood star Simbu: అందాల తార నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) 'సవ్యసాచి' చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. సవ్యసాచి, మిస్టర్ మజ్ను చిత్రాలు ప్లాప్స్ అయినా.. ఇస్మార్ట్ శంకర్‌తో ఓ హిట్ కొట్టారు. ప్రస్తుతం 'హీరో' విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. తన అందాలతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. కోలీవుడ్‌లో మాత్రం ఇస్మార్ట్ బ్యూటీ హవా నడుస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే కెరీర్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న నిధి అగర్వాల్.. ప్రేమలో (Nidhhi Agerwal Love) పడ్డట్టు ఫిలింనగర్ టాక్.
ఇస్మార్ట్ శంకర్‌తో మంచి విజయం అందుకున్న నిధి అగర్వాల్‌కు కోలీవుడ్‌లో నటించే అవకాశం వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో శింబు హీరోగా నటించిన 'ఈశ్వరన్' సినిమాలో నిధి హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేశారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈశ్వరన్.. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. సినిమాలో ఈ జంటకు ఫాలోయింగ్ కూడా పెరిగింది. సినిమా చిత్రీకరణ సమయంలో సన్నిహితంగా (Nidhhi Agerwal Dating) మెలిగిన నిధి, శింబు.. ఆపై ప్రేమలో పడ్డారట. వీరిద్దరూ తరచూ పబ్, డిన్నర్, పార్టీలు అంటూ బహిరంగానే కనిపిస్తున్నారని కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: Monkeys Snatch Baby: రెండు నెలల పసికందును ఎత్తుకెళ్లి.. నీళ్ల ట్యాంకులో పడేసిన కోతులు!!
కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో అందాల నిధి అగర్వాల్ సహజీవనం (Nidhhi Agerwal In A Live-In Relationship With Simbu) చేస్తున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. చెన్నైలో ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారని రూమర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ బంధంపై వస్తోన్న పుకార్లకు పుల్‌స్టాప్ చెప్పాలనే భావనలో నిధి, శింబు ఉన్నారట. వీలైనంత త్వరగా వివాహం చేసుకోనున్నారని ప్రచారం కూడా సాగుతోంది. ఇందులో నిజం ఎంత ఉందో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ తెలియదు. ప్రస్తుతం శింబుకి 38 ఏళ్లు కాగా.. నిధికి 28 ఏళ్లు. ఇద్దరి మధ్య వయసు తేడా 10 ఏళ్లు.
శింబు (Simbu)కు గతంలో పలువురు స్టార్ హీరోయిన్స్‌తో బ్రేకప్‌లైన విషయం తెలిసిందే. నయనతార, హన్సికలతో శింబు ప్రేమాయణం నడిపాడు. నయనతారతో అయితే పెళ్లివరకు వచ్చినా.. చివరి నిమిషంలో బెడిసికొట్టింది. హన్సికతో కూడా చాలా ఎల్లే లవ్ ట్రాక్ నడిపినా.. అది వర్కౌట్ అవ్వలేదు. ఇన్నిరోజులు ఒంటరిగానే ఉన్న శింబు.. నిధి అగర్వాల్‌తో సెట్ అవ్వనున్నాడు. మరోవైపు నిధికి సైతం స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul)తో ప్రేమ విఫలమైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి