Prabhas Spirit Movie Story: 'అర్జున్‌రెడ్డి' ఫేమ్​ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్​ 25వ చిత్రం (Prabhas Sandeep Reddy Vanga) తెరకెక్కనుంది. ఈ సినిమాకు.. 'స్పిరిట్‌' అనే టైటిల్‌ ఫిక్స్ (Prabhas 25th Movie) అయిన విషయం తెలిసిందే. టీ సిరీస్‌, వంగా పిక్చర్స్‌ సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కించనున్నాయి. భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో ప్రభాస్‌ 'స్పిరిట్‌' సినిమా తెరకెక్కనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో లేడీ విలన్​గా బాలీవుడ్​ హీరోయిన్​ కరీనా కపూర్​ నటించనుందని (Prabhas Spirit Movie Cast).. దీంతో కరీనా కపూర్​ టాలీవుడ్​ ఎంట్రీ ఇస్తుందని ఇటీవలే కొన్ని రూమర్లు వచ్చాయి. మూవీలో ప్రభాస్‌ పాత్రకు దీటుగా కరీనా పాత్ర (Kareena Kapoor Prabhas) ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు సినిమా బ్యాక్​డ్రాప్​పై ఆసక్తికర అప్​డేట్​ ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'స్పిరిట్​' సినిమాను స్పోర్ట్స్​ డ్రామాగా రూపొందించనున్నట్లు బాలీవుడ్​లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై చిత్రబృందం నుంచి స్పష్టత రావాల్సిఉంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్‌, కొరియన్‌, జపాన్‌ భాషల్లో 'స్పిరిట్‌' మూవీని రిలీజ్​ చేయనున్నారు.


ఈ సినిమా కోసం నిర్మాతలు అధిక బడ్జెట్​తో (Prabhas Spirit Movie Budget) నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారు. 'స్పిరిట్​' సినిమాలో (Prabhas Spirit Movie) నటించేందుకు ప్రభాస్​కు రెమ్యూనరేషన్​ భారీగా ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. 


Also Read: Kareena Kapoor in Prabhas Film: ప్రభాస్‌ స్పిరిట్‌ మూవీలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ విలనిజం!


Also Read: Radheshyam Teaser: ప్రభాస్‌ రాధేశ్యామ్‌ టీజర్‌ వచ్చేసింది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.