Is Samantha Getting Ready to Join BJP: స్టార్‌ హీరోయిన్‌ సమంత రాజకీయాల్లోకి వస్తుందా? అంటే అవును అనిపించే విధంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హడావుడి జరుగుతోంది. అయితే అసలు విషయం ఏమిటంటే ఈ మధ్య కాలంలో బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని ప్రయత్నిస్తూ సినీ హీరోలను కలుస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా అమిత్ షా ఎన్టీఆర్ ను, నడ్డా నితిన్ ను కలిశారు. ఇప్పుడు ఎందుకో ఏమో తెలియదు కానీ బీజేపీ సపోర్టర్స్ గా భావించబడుతున్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సమంత పాత వీడియోలను వైరల్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీని, మోదీని సపోర్ట్ చేస్తూ గతంలో కొన్ని సందర్భాల్లో సమంత మాట్లాడిన వీడియోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. దానికి తోడు ఈ మధ్యనే ఓ ఇంటర్వూలో సమంత బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతు అంటూ కామెంట్స్‌ చేశారు. అవేకాక గతంలో కూడా సమంత మోదీపై చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోను ఇండియన్ క్రికెటర్‌ అమిత్‌ కుమార్‌ షేర్‌ చేశాడు. వైరల్ అవుతున్న వీడియోలో సమంత మాట్లాడుతూ.. ‘నేను ఎల్లప్పుడు మోడీ సపోర్టర్‌నే అని, ఆయన చేసే మంచి పనులతో సంతోషంగా ఉన్నానని ఆమె పేర్కొంది.


ఇక మరో వీడియోలో.. కూడా తాను మోడీ సపోర్టర్‌ నే అని, ఆయన నాయకత్వంలో కచ్చితంగా దేశానికి మంచి జరుగుతుందని నమ్ముతున్నానని పేర్కొన్నారు. మోడీ దేశాన్ని ముందుకు నడిపిస్తారని, ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది.


ఇక కొన్ని రోజులుగా బీజేపీ సినిమా నటుల మీద కన్నేసిన నేపథ్యంలో సమంత బీజేపీ తీర్థం పుచ్చుకోవచ్చనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే శాకుంతలం, యశోద, ఖుషి, అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌ వంటి సినిమాలు ఆమె లిస్టులో ఉన్నాయి. అందులో శాకుంతలం, యశోద సినిమాలు షూటింగ్‌లు పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి.


Also Read: Bigg Boss Telugu 6: ఫోటోలతో సహా తెలుగు బిగ్ బాస్ 6 కంటెస్టంట్స్ లిస్టు చూశారా?


Also Read:  Bigg Boss Telugu Season 6: మొత్తం లోపలికి 21 మంది ఎంట్రీ.. ఎవరెవరు ఉన్నారంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి