Ishaan Ananya Dating: షాహిద్ కపూర్ తమ్ముడితో `లైగర్` బ్యూటీ డేటింగ్ - ఫొటోలు వైరల్!
![Ishaan Ananya Dating: షాహిద్ కపూర్ తమ్ముడితో 'లైగర్' బ్యూటీ డేటింగ్ - ఫొటోలు వైరల్! Ishaan Ananya Dating: షాహిద్ కపూర్ తమ్ముడితో 'లైగర్' బ్యూటీ డేటింగ్ - ఫొటోలు వైరల్!](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2022/03/17/224824-ishaan-ananya-dating.jpeg?itok=eIvhp8lX)
Ishaan Ananya Dating: స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్.. `ఖాలీపీలీ` సినిమాలో హీరోయిన్ అనన్యా పాండేతో కలిసి నటించాడు. ఆ చిత్రం నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని జోరుగా బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు ఇషాన్ తల్లి కన్ఫార్మ్ చేసింది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Ishaan Ananya Dating: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్యా పాండే.. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన 'లైగర్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పుడు అనన్యకు సంబంధించిన ప్రేమాయణం గురించి బాలీవుడ్ మీడియాలో కోడై కూస్తుంది. స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ తో అనన్యా పాండే డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
'ఖాలీపీలీ' సినిమాలో ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా తర్వాత కూడా వీరిద్దరూ కలిసి విహారయాత్రలు, పార్టీలు, పబ్ లకు వెళ్తున్నారట. అలా వెళ్తూ చాలాసార్లు మీడియా కంట పడ్డారు.
[[{"fid":"224825","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
వీరిద్దరి ప్రేమ వ్యవహారంపై ఇషాన్ ఖట్టర్ తల్లి నీలిమా అజీమ్ కూడా ఓ మీడియా ఇంటర్వ్యూలో స్పందించింది. అనన్యా పాండే గురించి తనకు తెలుసనని.. ఆమె తన కుటుంబానికి మంచి సన్నిహితురాలని తెలిపింది. తన కుమారుడు ఇషాన్ ఖట్టర్ జీవితంలో ఆమె ఓ ముఖ్యమైన భాగమైనట్లు ఆమె స్పష్టం చేసింది.
Also Read: Dangal Girl Hot Pics: దంగల్ గర్ల్ ఫాతిమా సనా షేక్ హాట్ ఫోటోలు..చూస్తే నమ్మలేరు మరి
Also Read: Ghani Movie Trailer: 'ఈ బాక్సర్ కు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు'.. గని మూవీ ట్రైలర్ రిలీజ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook