Allu Arjun Zomato Trolls: టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇటీవలి కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. రాపిడో సంస్థకు చెందిన ప్రకటనలో ఆర్టీసీని అవమానించారంటూ ఇటీవల తీవ్ర విమర్శలు రాగా.. తాజాగా జొమాటో యాడ్‌లో దక్షిణాది సినిమా పరిశ్రమను కించపరిచాడంటూ ఫాన్స్, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జొమాటో యాడ్‌ను బ్యాన్ చేయాలంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే.... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లు అర్జున్‌ తాజాగా ఫుడ్ డెలివరీ యాప్ 'జొమాటో' కోసం ఓ యాడ్‌ చేశారు. ఈ యాడ్‌లో టాలీవుడ్ నటుడు సుబ్బరాజు కూడా నటించారు. యాడ్‌లో సుబ్బ‌రాజ్ ఇచ్చే పంచ్ నుంచి త‌ప్పించుకున్న స్టైలిష్ స్టార్.. అత‌డికే రివ‌ర్స్‌లో పంచ్ ఇస్తాడు. దీంతో సుబ్బ‌రాజ్ ఒక్కసారిగా గాల్లోకి లేస్తాడు. గాల్లోనే ఉన్న సుబ్బ‌రాజ్ మాట్లాడుతూ.. 'బ‌న్నీ.. న‌న్ను కొంచెం త్వరగా కింద ప‌డేయ‌వా?' అంటాడు. 'సౌత్ సినిమా కదా.. కొంచెం ఎక్కువసేపు ఎగరాలి' అని అల్లు అర్జున్‌ రిప్లై ఇస్తాడు. ఈ డైలాగే ఇప్పుడు ఐకాన్ స్టార్‌ను ఇబందుల్లో పడేసింది. 


జొమాటో యాడ్‌లో సౌత్ ఇండియా సినిమాలను అల్లు అర్జున్‌ కించపరిచాడంటూ దక్షిణాది సినీ అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. దక్షిణాది నుంచే స్టార్‌ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్.. మూలాలు మరిచిపోతే ఎలా? అంటూ మండిపడుతున్నారు. 'ప్రభాస్ సౌత్ ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ పెంచుతుంటే.. అల్లు అర్జున్ సౌత్ ఇండియన్ సినిమాని దిగజార్చుతూ తన సొంత స్టాండర్డ్స్‌ను పెంచుకుంటున్నాడు' అని ఒక ఋ కామెంట్ చేయగా.. 'భారతీయ సినిమాలో మంచి స్థానంలో ఉన్న దక్షిణాది సినిమాని మన ఐకాన్ స్టార్ ఇలా దిగజార్చడం సిగ్గుచేటు. ఇలాంటి ప్రకటన ఊహించలేదు' అని ఇంకొకరు ట్వీట్ చేశారు.



'అల్లు అర్జున్.. దక్షిణాది సినిమాని ఇంత దిగజార్చుతావా?', 'ఓ సినీ అభిమానిగా సిగ్గుపడుతున్నా', 'జొమాటో యాడ్‌ను బ్యాన్ చేయండి', 'అన్ ఇన్‌స్టాల్ జొమాటో' అంటూ నెట్టింట నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గతంలో రాపిడో సంస్థకు చెందిన ఓ యాడ్‌లో ఆర్టీసీని అవమానించారంటూ మనోడిపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా బాహాటంగానే విమర్శలు చేశారు. ఇప్పుడు ఎవరు స్పందిస్తారో చూడాలి. 



Also Raed: Todays Gold Price: తగ్గిన పసిడి ధర, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం ధరలు


Also Read: Medaram Jatara : మేడారం జాతర కోసం TSRTC ప్రత్యేక యాప్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook