Sonali Bendre: ఎన్టీఆర్ చిత్రంలో సోనాలి బింద్రే.. అసలు విషయం చెప్పేసిన హీరోయిన్!
Sonali Bendre quashes rumours of joining Jr NTR`s next Movie. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో త్వరలోనే తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30లో సోనాలి బింద్రే ఓ కీలక పాత్ర చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్.
Sonali Bendre reacts about Jr NTR and Koratala Siva next Movie: ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసి టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగారు సొనాలీ బింద్రే. మహేష్ బాబు హీరోగా వచ్చిన 'మురారి' సినిమాతో మంచి హిట్ అందుకున్న సొనాలీ.. తెలుగులో ఇంద్ర, ఖడ్గం, మన్మధుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమెకున్న క్రేజ్ మాత్రం బాగానే ఉంది. 2018లో కాన్సర్ బారినపడి కోలుకున్న సొనాలీ బింద్రే.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ప్రముఖ బ్రిటీష్ టెలివిజన్ సిరీస్ 'ప్రెస్' ఆధారంగా తెరకెక్కిన 'ది బ్రోకెన్ న్యూస్' వెబ్ సిరీస్‌లో సోనాలి బింద్రే నటించారు. తాజాగా సోనాలి తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో త్వరలోనే తెరకెక్కనున్న సినిమా (ఎన్టీఆర్ 30)లో ఓ కీలక పాత్ర చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. సినిమాను మలుపు తిప్పే పాత్రలో సోనాలి నటిస్తారని అన్నారు. తాజాగా ఈ వార్తలపై సోనాలి స్పందించారు.
తాజాగా 'ది బ్రోకెన్ న్యూస్' వెబ్ సిరీస్ కోసం ఓ ఇంటర్వూలో సోనాలి బింద్రే పాల్గొనగా.. ఎన్టీఆర్ 30 సినిమాలో మీరు నటిస్తున్నారా? అని అడగ్గా.. 'నేనా.. ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్నానా. నాకు ఈ విషయమే తెలీదు. నాకు మీరు మాట్లాడే దానిపై ఎలాంటి సమాచారం లేదు. బహుశా అది నేను కాదేమో. ఇది కచ్చితంగా అసత్య వార్త. ఒకవేళ అదే నిజమైతే.. ఇప్పటివరకూ ఎవరూ నన్ను సంప్రదించలేదు' అని సోనాలి బదులిచ్చారు.
ఎన్టీఆర్, కొరటాల శివ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఇద్దరి కలయికలో ఇదివరకు వచ్చిన 'జనతా గ్యారేజ్' సినిమా ఎంతటి ఘన విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఎన్టీఆర్ 30పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్‌కు ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్ బట్టి చూస్తే ఎన్టీఆర్ సరికొత్తగా కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నది ఇప్పటివరకు తెలియరాలేద్దు.
Also Read: Sachin Tendulkar Playing XI: ధోనీ, రోహిత్, కోహ్లీ లేరు.. సచిన్ ఐపీఎల్ 2022 జట్టు ఇదే!
Also Read: Ageing Process: వృద్ధ్యాప్య ఛాయలు పోవాలంటే..ఈ పద్ధతులు మార్చుకోకతప్పదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook