Jabardasth Avinash: జబర్దస్త్ కమెడియన్ ఇంట విషాదం.. బిడ్డను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో అవినాష్..
Jabardasth Avinash: జబర్దస్త్ కమెడియన్ అవినాష్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తన భార్య అనూజకు అబార్షన్ అయిందని.. తమ బిడ్డను కోల్పోయినట్లు సోషల్ మీడియా వేదికగా తన బాధను పంచుకున్నాడు అవినాష్.
Jabardasth Avinash gets Emotional: జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అవినాష్. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం పలు షోలు, ఈవెంట్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల అవినాష్ త్వరలోనే తల్లిదండ్రులము కాబోతున్నామంటూ తన భార్య అనూజతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తన సంతోషాన్ని పంచుకున్నాడు. అయితే తాజాగా అవినాష్ ఇంట విషాదం చోటుచేసుకుంది. తమ బిడ్డను కోల్పోయిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు అవినాష్. తన భార్య అనూజకు అబార్షన్ అయిందని.. తమ బిడ్డను కోల్పొయినట్లు ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. దీంతో అవినాష్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సెలెబ్రిటీలు ధైర్యం చెబుతున్నారు.
''నా లైఫ్‌లో సంతోషమైన, బాధ అయినా… నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటివరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాను. మేము అమ్మనాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కొల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగ మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలీ అన్న బాధ్యతతో ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకీ థాంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్'' అంటూ అవినాష్ రాసుకోచ్చాడు.
Also Read: Captain Miller Trailer: పవర్ ప్యాక్డ్‌గా ధనుష్ ‘'కెప్టెన్ మిల్లర్'’ ట్రైలర్
Also Read:Guntur Kaaram Trailer: మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇవాళే 'గుంటూరు కారం' ట్రైలర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి