Jabardasth Praveen : జబర్ధస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ప్రవీణ్ తండ్రి మంగళవారం  కన్నుమూశారు.  బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ప్రవీణ్ తండ్రిని వైద్యులు బతికించే ప్రయత్నం చేసినప్పటికీ.. వారి ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స అందిస్తున్న దశలోనే అతడి కాళ్లు, చేతులు విపరీతంగా వాయడంతో పాటు ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఇక ఇదే చివరి స్టేజ్ అని వైద్యులు చెప్పకనే చెప్పేశారు. దీంతో తండ్రిని బతికించుకునేందుకు ప్రవీణ్ చేసిన అన్ని ప్రయత్నాలు వృథా అయ్యాయి. చిన్న వయస్సులోనే తల్లిని కోల్పోయిన ప్రవీణ్.. తాజాగా తండ్రి మరణంతో తల్లిదండ్రులు ఇద్దరూ లేనివాడయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన తల్లి చనిపోయిన తర్వాత తన తండ్రి ఇద్దరు కొడుకులను పెంచి పెద్ద చేసుకుంటూ, చదివించుకుంటూ తన జీవితాన్నే త్యాగం చేశాడంటూ గతంలో ప్రవీణ్ చెప్పిన మాట ఈ సందర్భంగా ఆడియెన్స్ గుర్తుచేసుకుంటున్నారు. పటాస్ కామెడి షోలో పంచ్‌లు, ప్రాసలతో కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న ప్రవీణ్‌కి జబర్ధస్త్ షో ద్వారా మరింత గుర్తింపు లభించింది.


Also Read : Nassar Injured : సినీ నటుడు నాజర్‌కు గాయాలు..ఆస్పత్రికి తరలింపు..!


 


Also Read : Chiranjeevi helps Dondapati Chakradhar: అభిమాని ఆరోగ్యానికి ‘మెగా’ అండ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P2DgvH


Apple Link - https://apple.co/3df6gDq


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook