Jordar Sujatha Birthday బుల్లితెరపై రాకేష్ సుజాతల సందడి కాస్త ఎక్కువే ఉంది. సోషల్ మీడియాలో ఈ ఇద్దరూ కలిసి తిరుగుతున్నారు. గోవాలంటూ బీచుల్లో కలిసి తిరిగారు. ఇప్పుడు దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. దుబాయ్‌లో సుజాత, రాకేష్‌లు నానా హంగామా చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ దుబాయ్‌లో బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో మునిగి తేలిపోతోన్నారు. సుజాత బర్త్ డే అంటూ రాకేష్ నెట్టింట్లో సందడి చేస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాకేష్, సుజాత ట్రాక్‌ మీద సోషల్ మీడియాలో వచ్చే టాక్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ షోతో ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. రాకేష్‌, సుజాత వేసే స్కిట్లు కూడా అలానే ఉంటాయి. రొమాంటిక్ ట్రాక్‌ బాగానే క్లిక్ అవ్వడంతో రాకేష్‌, సుజాతలు ఆఫ్ స్క్రీన్‌లోనూ బంధాన్ని కంటిన్యూ చేస్తోన్నట్టుగా కనిపిస్తోంది.


 



ఇక రాకేష్‌ ఇంట్లోనే సుజాత ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆ మధ్య వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సుజాత సందడి చేసింది. రాకేష్‌ అమ్మతో కలిసి సుజాత బాగానే కలివిడిగా కనిపించింది. ఆ తరువాత కూడా ఓ పర్సనల్ ఫోటోలో రాకేష్‌ ఇంట్లోనే సుజాత కనిపించింది.


అయితే ఇప్పుడు ఈ జంట మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. గత నాలుగైదు రోజుల్లో దుబాయ్‌లోనే ఈ ఇద్దరూ సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఇలా బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో సుజాత, రాకేష్‌లు హల్చల్ చేస్తున్నారు. సుజాత కోసం రాకేష్ గట్టిగానే ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది. సుజాత కోసం కేక్ కట్ చేయించిన రాకేష్‌.. ఆమెకు ఆప్యాయంగా తినిపిస్తున్నాడు. ఇక సుజాత సైతం రాకేష్‌కు కేక్‌ను తినిపించింది. ఈ ఇద్దరి బంధం మీద అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.


Also Read: Tamannaah Bhatia Dating : విలన్‌తో ప్రేమలో తమన్నా.. ముద్దుల్లో తేలిపోతోన్న జంట


Also Read: Waltair Veerayya Censor Review : వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్.. ఆ సీన్లకు పూనకాలు లోడింగే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి