Jagapathi Babu in Pushpa సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప ది రైజ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తెలుగులో డివైడ్ టాక్ తెచ్చుకున్నా కూడా నార్త్‌లో మాత్రం దుమ్ములేపేసింది. డబ్బింగ్ సినిమాతోనే బన్నీ హిందీ బెల్టులో వంద కోట్లు కొల్లగొట్టేసింది. నార్త్‌లో పుష్పకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దెబ్బకు అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. అందుకే రెండో పార్ట్‌ను సుకుమార్ మరింతగా చెక్కుతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండో పార్ట్‌ను తెరకెక్కించడంలో కాస్త లేట్ అయినా కూడా సుకుమార్, బన్నీలు లైట్ తీసుకుంటున్నారు. ఎంత లేట్ అయినా పర్లేదు.. కంటెంట్‌లో మాత్రం తేడా కొట్టొద్దని అనుకుంటున్నారు. అందుకే బన్నీ, సుకుమార్‌లు రెండో పార్ట్ కోసం కావాల్సినంత టైంను వెచ్చిస్తున్నారు. ఇప్పుడు పుష్ప రెండో పార్ట్ మీద అంచనాలు ఆకాశన్నంటాయి.


వేర్ ఈజ్ పుష్ప అంటూ సుకుమార్ వదిలిన వీడియో, బన్నీని మహా కాళి అవతారంలో చూపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. ఇక వేర్ ఈజ్ పుష్ప వీడియోకు నార్త్‌లోనే ఎక్కువ క్రేజ్ వచ్చింది. దాదాపు డెబ్బై మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది వేర్ ఈజ్ పుష్ప. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.


సుకుమార్ సినిమాలంటే జగపతి బాబుకు ఓ ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాల్లో జగపతి బాబు పాత్ర ఎంతలా క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే పుష్ప సినిమాలో జగపతి బాబుకు ఎలాంటి పాత్ర ఇవ్వలేదు సుకుమార్. కానీ ఇప్పుడు రెండో పార్ట్‌కు అదిరిపోయే పాత్రను ఇచ్చినట్టుగా తెలుస్తోంది.


Also Read:  IT Raids on Mythri : మైత్రీ కార్యాలయంలో రెండో రోజూ ఐటీ దాడులు.. వందల కోట్లపై ఆరా


సుకుమార్‌తో పని చేయడం ఎప్పుడూ ఇష్టమేనని, ఎందుకంటే నెక్ట్స్ ఏం జరుగుతుందనేది కూడా ఎవ్వరికీ తెలియదని, ఇంతకు ముందు కూడా నాకు ఎన్నో మంచి పాత్రలు ఇచ్చాడని, పుష్ప మొదటి పార్ట్ నాకు ఎంతో నచ్చిందని, ఇప్పుడు మంచి పాత్రను ఇచ్చారని సుకుమార్ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు జగపతి బాబు.


Also Read: Mrunal Thakur : 'సీత'ను రొమాంటిక్‌గానే చూడాలనుకుంటున్నారా?.. నెటిజన్ల కోరిక ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook