Prabhas Salaar: డార్లింగ్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న తాజా చిత్రం సలార్. ఈ మూవీ నుంచి కీలక అప్ డేట్ వచ్చేసింది. ప్రశాంత్ నీల్ (Director Prashant Neil) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అప్ డేట్స్ గురించి సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఈ క్రమంలోనే సోమవారం ఉదయం సలార్‌(Salaar)’ నుంచి ఓ స్పెషల్‌ అప్‌డేట్‌ని చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఓ కీలక పాత్రను పరిచయం చేసింది. 'రాజమనార్‌'(Rajamanar‌)గా కీ రోల్‌లో కనిపించనున్న జగపతిబాబు(Jagapathibabu) లుక్‌ను విడుదల చేసింది. ఇందులో జగపతిబాబు ముక్కుకు రింగు, కోపం నిండిన చూపులతో ఫుల్‌ సీరియస్‌ లుక్‌లో దర్శనమిచ్చారు.


Also Read: Karthikeya Engagement: హీరో కార్తికేయకు నిశ్చితార్థం..నెట్టింట ఫోటో హల్ చల్!



భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) వైల్డ్, సీరియస్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో శ్రుతిహాసన్ (Sruthihasan) ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. హంబులే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. డైరెక్టర్ కేజీఎఫ్ (KGF Director) హీరోయిన్ శ్రీనిధి శెట్టితో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారని సమాచారం. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించేసింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook