Rudrangi OTT Streaming: ఫ్యామిలీ హీరో జ‌గ‌ప‌తిబాబు (Jagapathi Babu) లీడ్ రోల్ లో నటించిన చిత్రం 'రుద్రంగి'. మిక్సడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. జూలై 7న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా నెలరోజులు కూడా పూర్తికాకుండానే ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ఎలాంటి ముంద‌స్తు ప్రకటన లేకుండా నేరుగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో(Amazon Prime video) రిలీజ్ చేశారు మేకర్స్.  పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో  జ‌గ‌ప‌తిబాబుతో పాటు విమ‌లారామ‌న్‌, మ‌మ‌తా మోహ‌న్‌దాస్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అజ‌య్ సామ్రాట్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాకు తెలంగాణ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ నిర్మాత‌గా వ్యవహారించారు. బాలకృష్ణ ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రుద్రంగి చిత్రంలో 'భీమ్‌రామ్‌ దేశ్‌ముఖ్‌' అనే దొర పాత్రలో జగపతిబాబు నటించాడు. ఆయన ఇద్దరి భార్యల పాత్రల్లో మీరాబాయి (విమలారామన్‌), జ్వాలాబాయి (మమతా మోహన్‌ దాస్‌) కనిపించారు. ఈక్రమంలో జగ్గూభాయ్‌ రుద్రంగి అనే మరో అమ్మాయిపై మనసు పడతాడు. ఈ క్రమంలో ఆమెను సొంతం చేసుకునేందుకు భీమ్‌రావ్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అతడికి ఎదురుతిరిగిన మ‌ల్లేష్ (ఆశీష్ గాంధీ) ఎవ‌రు? మల్లేష్ తో రుద్రంగికి ఉన్న సంబంధం ఏంటి? అనే కథాంశంతో సినిమా తెరకెక్కింది. ముఖ్యంగా ఈ మూవీ అనాటి తెలంగాణ గ‌ఢీలు, దొర‌ల నేప‌థ్యంలో తెరకెక్కించారు దర్శకుడు అజయ్ సామ్రాట్.  బాహుబ‌లి సినిమాకు అజ‌య్ సామ్రాట్ రైట‌ర్‌గా వ్యవహారించడం విశేషం.


Also Read: Oh My God-2 Movie: దేవుడి సినిమాకు ‘A’ సర్టిఫికేట్‌.. షాక్ లో బాలీవుడ్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook