Jai Bhim Movie Trailer: సూర్య `జై భీమ్` ట్రైలర్ వచ్చేసింది!
Jai Bhim Movie Trailer: తమిళ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `జై భీమ్`. నవంబరు 2న అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం శుక్రవారం (అక్టోబరు 22) ట్రైలర్‌ను విడుదల చేసింది.
Jai Bhim Movie Trailer: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కొత్త చిత్రం 'జై భీమ్' (Suriya Jai Bhim Movie). సామాజిక, రాజకీయ అంశాలతో రూపొందిన ఈ సినిమాకు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. రజీషా విజయన్ హీరోయిన్గా నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. సూర్య స్వీయ నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ కింద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వేదికగా 'జై భీమ్' సినిమా నవంబరు 2న (Jai Bhim Movie Release Date) విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను (Jai Bhim Movie Trailer) చిత్రబృందం రిలీజ్ చేసింది.
రిటైర్డ్ న్యాయమూర్తి జీవితాధారంగా..
చంద్రు.. హైకోర్టు రిటైర్డ్ జడ్జి. ఈయన తన పదవీకాలంలో 96 వేల కేసులను పరిష్కరించారు. 1993లో ఆయన న్యాయవాదిగా ఉన్నప్పుడు ఓ గిరిజన మహిళ న్యాయం కోసం పోరాటం చేశారు. సూర్య నటించబోయే సినిమా ఆ కేసు ఆధారంగానే రూపొందించనున్నట్లు సమాచారం. ఇందులో సూర్య.. రిటైర్డ్ జడ్జి, లాయర్‌గా కనిపించనున్నారట. మనికందన్, లిజొమోల్ జోస్, రజిష విజయన్, ప్రకాశ్ రాజ్ (పోలీస్ ఆఫీసర్‌గా) కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీన్ రోల్డన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
సూర్య కొత్త సినిమాలు
హీరో సూర్య ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లోనూ నటిస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వంలో 'ఎత్రక్కుమ్ తునిందవన్' (Etharkum Thuninthavan Suriya) చేస్తున్నారు. ఇది కూడా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పొలాచ్చి గ్యాంగ్ రేప్ ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.
'నవరస' వెబ్‌సిరీస్‌లోనూ (Navarasa On Netflix) తనదైన నటనతో ఆకట్టుకున్నారు హీరో సూర్య. వెట్రిమారన్ దర్శకత్వంలో 'వడివాసల్' ఆయన నటిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ కూడా అదిరిపోయింది! హీరో మాధవన్ స్వీయదర్శకత్వంలో తీస్తున్న 'రాకెట్రీ'లోనూ (Suriya Rocketry) అతిథి పాత్రలో సూర్య మెరవనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook